• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జల్సాలకు బానిసై... భవిష్యత్‌కు దూరమై... మృత్యుఒడికి చేరిన యువకుడు

|

యువతకు జీవితంలో స్థిరపడే సరైన మార్గాలు తెలియకపోవడంతోపాటు, జీవితానికి సంబంధించిన విషయాలను ఎవరు చెప్పిన వినిపించుకోని సంధర్భాలు ఉంటాయి. అన్ని జల్సాలు అయిపోయాక... పక్కవారు స్థిరపడి ,తాము మాత్రం ఇంకా వెనకబడి ఉండడంతో అవేదనకు లోనవుతారు. దీంతో ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతుంటారు. ఇబ్బందులను అధిగమించేందుకు మత్తులకు బానిసలవుతారు. ఇలా సాటివారు బంగారు భవిష్యత్ లో మునిగిపోతే.. తాను మాత్రం ఏమి చేయలేని ఓ యువకుడు చివరికి మృత్యు ఒడికి చేరిన ఘటన హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

జల్సాలు..ప్రియురాలు..చివరికి మృత్యుఒడికి...

జల్సాలు..ప్రియురాలు..చివరికి మృత్యుఒడికి...

యువత అంటే జల్సాలు, జల్సాల తర్వాత ఏదైనా...సమయం దొరకదని అనుకుంటారో ఏమో..అప్పుడే అన్ని అయిపోవాలి. చిరు ప్రాయంలోనే జీవితాన్ని మొత్తం అనుభవించాలి. భవిష్యత్ గురించి బాధ అనేది ఉండదు. భవిష్యత్ ఏమైన పర్వాలేదని అనే అలోచన ...ఇప్పుడున్న చాలమంది యువకుల్లో ఇదే ధోరణి కనిపిస్తుంది. దీంతో చివరికి జల్సాలతో ఏం సాధించలేక ఇబ్బందులకు గురవుతున్న వనపర్తి జిల్లాకు చెంది హైదరాబాద్ లో స్థిరపడ్డ యువకుడు ప్రాణాలు వదిలాడు...

తల్లిదండ్రుల మాట వినని యువకుడు

తల్లిదండ్రుల మాట వినని యువకుడు

వనపర్తి జిల్లాకు చెందిన శివకుమార్ గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్‌‌ పహాడీషరీఫ్‌లో వాటర్ ప్లాంట్ నడుపుతున్నాడు. అయితే శివకుమార్ రెండో కుమారుడు లోకేష్ ఇంటర్ వరకు చదుకుని..అనంతరం జల్సాలకు అలవాటు పడి చదువు మానేశాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా.. వినకుండా తన దారిన తాను వెళ్లాడు. సినిమాలు ,షికార్లు, జల్సాలతో కొద్ది రోజులు జీవితాన్ని అనుభవించాడు. దీంతో తల్లిదండ్రులు సైతం లోకేష్ ను వదిలివేశారు. ఇంటికి వచ్చినా రాకున్న పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇక తల్లిదండ్రులు కూడ పట్టించుకోకపోవడంతో లోకేష్ తన స్నేహితులతో కలిసి ఎక్కువగా ఉండేవాడు. రాత్రీళ్లు అక్కడే నిద్రించేవాడు.

నిద్ర కోసం స్లీపింగ్ టాబ్లెట్స్...

నిద్ర కోసం స్లీపింగ్ టాబ్లెట్స్...

కాని ఇలా రోజులు గడిచిన తర్వాత తన స్నేహితులు సైతం స్థిరపడుతుండడం, తన తల్లిదండ్రులు సైతం దూరం పెట్టడం లాంటీ అంశాలు లోకేష్ ను భాధించాయి. దీంతో అంతర్గతంగా మదనపడడం ప్రారంభమైంది. ఇలా రోజు ఇదే పరిస్థితి ఉండడంతో కనీసం నిద్ర కూడ రాని పరిస్థితి వచ్చింది. దీంతో నిద్రకోసం స్లీపింగ్ మాత్రలు వాడడం ప్రారంభించాడు. ఇలాగే ప్రతిరోజు వాడుతుండడంతో శారీరక ఇబ్బంది కల్గింది. ఇలా అలవాటు ప్రకారం రెండు రోజుల క్రితం మాత్రలు వేసుకుని నిద్రపోయాడు. ఇక లోకేష్‌ను దురదృష్టం వెంటాడీ నిద్రలోనే ఫిట్స్ సైతం అటాక్ అయింది. కాని నిద్రలో ఉన్న తన స్నేహితులు సైతం గమనించలేదు. దీంతో లోకేష్ అనంతలోకాలకు వెళ్లిపోయాడు.

లోకేష్ కు ప్రేమ వ్యవహారం కూడ ఉంది..

లోకేష్ కు ప్రేమ వ్యవహారం కూడ ఉంది..

కాగా పోలీసుల విచారణలో లోకేష్ ప్రేమ వ్యవహరం కూడ ఉన్నట్టు వారి దర్యాప్తులో తేలింది. ఈనేపథ్యంలో స్నేహితులతో ప్రతి సారి చర్చిస్తూ ఉండేవాడని తేలింది. ఓవైపు స్నేహితులు, మరోవైపు తల్లిదండ్రులు, ప్రేమ ఇవన్ని కలగలసి లోకేష్‌కు నిద్ర రాకుండా చేశాయి. తల్లిదండ్రుల మాట వినకుండా చిన్నతనంలోనే స్నేహితుల సహవాసం ఉన్నా.. వారు కూడ మృత్యువును గమనించని పరిస్థితి దాపురించింది.

English summary
a young man ends his life with joyfull things, Shivakumar who is father of young man of Vanaparthi district has been running a water plant at Pahadishari in Hyderabad for the last 20 years. However,Sivakumar's second son, Lokesh, went to Inter and afterwards he started enjoy in life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X