Srikanth: విడాకుల పుకార్లను ఖండించిన శ్రీకాంత్..
సినీ నటుడు శ్రీకాంత్, ఆయన భార్య ఊహ విడాకులు తీకుంటున్నారని సోషల్ మీడియాలో గత కొద్ది రోజులు రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ మరి ఎక్కవ కావడంతో శ్రీకాంత్ స్పందించాడు. విడాకుల విషయాన్ని ఖండించారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్లు ఫేస్ న్యూస్ సర్క్యూలేట్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రూమర్స్ ఎవరు పుట్టిస్తున్నారో తెలియదని.. ప్రెస్ నోట్ విడుదల చేశారు.

చనిపోయినట్లుగా
గతంలో తను చనిపోయినట్లుగా రూమర్స్ వచ్చాయని చెప్పారు. ఈ పుకార్లతో తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని అన్నారు. కొన్ని వెబ్సైట్స్‌లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్‌ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించిందని శ్రీకాంత్ ప్రెస్ నోట్ లో తెలిపారు.

సోషల్ మీడియా
ఇలాంటివి ఏమాత్రం నమ్మోద్దు. ఆందోళన పడోద్దు అని తనను ఓదార్చానని చెప్పారు . అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్సైట్స్, యూట్యూబ్ చానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. తను, ఊహ నిన్న చెన్నై వచ్చి వచ్చామని ఇక్కడి నుంచి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నామన్నారు.

సైబర్ క్రైమ్
ఇలాంటి రూమర్స్ తమ కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుందన్నారు. ఈ రూమర్ ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నామన్నారు. తన మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని.. వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications