కేసీఆర్‌తో విజయ్ భేటీ.. వంశీ పైడిపల్లి కూడా.. ప్రాధాన్యం
సీఎం కేసీఆర్‌ను తమిళ హీరో విజయ్ కలిశారు. హైదరాబాద్ వచ్చిన విజయ్ ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హీరో విజయ్‌తోపాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. వీరిని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. హీరో విజయ్‌ను సీఎం కేసీఆర్ శాలువాతో సన్మానించారు. విజయ్‌ను కేసీఆర్ అప్యాయంగా పలకరించి సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం హీరో విజయ్ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా దర్శకుడు వంశీపైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. సినిమాను తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నేపథ్యంలో హీరో విజయ్ హైదరాబాద్ వచ్చారు. హీరో విజయ్ సినిమాలు తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

'అదిరింది', 'విజిల్', 'తుపాకీ', 'మాస్టర్', 'బీస్ట్' సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. మంచి ఆదరణ కూడా పొందాయి. హీరో విజయ్‌కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్ అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంటారు.
సీఎం కేసీఆర్‌తో భేటీ ఏ అంశంపై జరిగిందనే అంశం మాత్రం తెలియరాలేదు. ప్రత్యేక అంశంపై చర్చించేందుకే విజయ్ ప్రగతి భవన్‌కు వెళ్లారా? లేదంటే హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశారా? అన్న దానిపై స్పష్టత లేదు. సీఎంను సినీ సార్ట్ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.
-
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
విజయ్ కు బిగ్ షాక్.. -
విజయ్‌ను భయపెట్టిన అభిమాని.. సైకిల్ ఆపి పరుగో పరుగు! వీడియో -
త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు.. టెన్షన్ లో విజయ్..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications