• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆదిలాబాద్ రాజకీయం.. గులాబీ పరిమళించేనా.. కమలం వికసించేనా?

|

ఆదిలాబాద్‌ : జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. గులాబీ పరిమళానికి చెక్ పెట్టే విధంగా కమలం కూడా సై అంటోంది. కారు జోరుకు కళ్లెం వేసేలా కాషాయం దండు స్పీడ్ పెంచుతోంది. నువ్వా నేనా అనే రేంజ్‌లో రెండు పార్టీల మధ్య పోటీ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉద్యమ నేపథ్యం మొదలు రాజకీయ శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ దూకుడుకు.. మొన్నటి లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ ఝలక్ ఇచ్చింది. ఎంపీ స్థానాన్ని అవలీలగా కొట్టేసింది. తాజాగా సభ్యత్వ నమోదులోనూ ఈ రెండు పార్టీల మధ్యే పోటీ నెలకొంది.

ఆదిలాబాద్‌లో పొలిటికల్ సెగ.. కారు వర్సెస్ కాషాయం..!

ఆదిలాబాద్‌లో పొలిటికల్ సెగ.. కారు వర్సెస్ కాషాయం..!

ఆదిలాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ సెగ పుట్టిస్తోంది. టీఆర్ఎస్‌కు దీటుగా ఎదగాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయ శక్తిగా అవతరించిన టీఆర్ఎస్‌కు క్షేత్రస్థాయిలో మంచి పట్టుంది. క్యాడర్, లీడర్ బలంగా ఉన్న పార్టీగా దూసుకెళుతోంది. అయితే బీజేపీ పరిస్థితి వేరు. మోడీ ఛరిష్మానో లేదంటే బీజేపీ పవరో ఏమోగానీ ఇప్పుడిప్పుడే అంతో ఇంత బలం కూడగట్టుకుంటోంది. క్యాడరున్నా.. లీడర్లు లేని కాషాయం దండు మరి ఎలా ముందుకెళుతుందనేది పెద్ద ప్రశ్న. అయినప్పటికీ గులాబీ వనానికి చెక్ పెట్టేలా కాషాయం జెండా రెపరెపలాడేలా బీజేపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నారు.

మొబైల్ ఆర్డర్ ఇస్తే గడియారం.. ఇంకేదో కొంటే ఖాళీ బాక్స్.. ఆన్‌లైన్‌ షాపింగ్ లీలలు..?

లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకున్న బీజేపీ

లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకున్న బీజేపీ

మొన్నటి లోక్ సభ ఎన్నికలు ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలను మరింత వేడెక్కించాయని చెప్పొచ్చు. టీఆర్ఎస్ బలాన్ని, బలగాన్ని ఢీకొట్టి మరీ బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు ఎంపీగా విజయం సాధించడం ఆ పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. అదే ఊపుతో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులేస్తున్నారు పార్టీ పెద్దలు. ఆ క్రమంలో సభ్యత్వ నమోదును టార్గెట్ చేసి వీలైనంత ఎక్కువ మందికి కమల తీర్థం పోయాలని డిసైడయ్యారు.

అటు టీఆర్ఎస్.. ఇటు బీజేపీ.. సభ్యత్వ నమోదులో పోటాపోటీ

అటు టీఆర్ఎస్.. ఇటు బీజేపీ.. సభ్యత్వ నమోదులో పోటాపోటీ

పార్టీ బలోపేతానికి అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ క్రమంలో జిల్లాలో సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాయి. టీఆర్ఎస్‌కు గతంలో కంటే 50 శాతం సభ్యత్వాలు అధికం కాగా.. బీజేపీకి మాత్రం మూడింతలు పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్‌ బాపురావు, లోక భూమారెడ్డి నేతృత్వంలో సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టారు. ఇక బీజేపీ నుంచి ఎంపీ సోయం బాపురావుతో పాటు జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ ఆధ్వర్యంలో మెంబర్‌షిప్ క్యాంపెయిన్ ఉధృతం చేశారు. అంతేకాదు హైదరాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ, రాజాసింగ్ లాంటి నేతలను జిల్లాకు రప్పించారు. ఆ క్రమంలో బీజేపీ సభ్యత్వ నమోదులో ఊపు కనిపించింది.

ఆ ముగ్గురు నేరస్థులు.. కేసులు లేని మరో ఇద్దరు .. అందరు కలిసి రెచ్చిపోయారుగా..!

మున్సిపల్ పోరులో కారు, కాషాయం.. కౌన్సిలర్లుగా పోటీ చేద్దామని..!

మున్సిపల్ పోరులో కారు, కాషాయం.. కౌన్సిలర్లుగా పోటీ చేద్దామని..!

జిల్లాలో సభ్యత్వ నమోదులు పరిశీలించినట్లైతే ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో టీఆర్ఎస్‌కు 50 వేల సభ్యత్వాలు నమోదు కాగా.. బీజేపీకి 39 వేల వరకు వచ్చాయి. బోథ్ నియోజకవర్గం పరిధిలో గులాబీకి 40 వేలు రాగా.. కాషాయం దండుకు 22 వేలు వచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆసిఫాబాద్, ఖానాపూర్ సెగ్మెంట్లలోని పలు మండలాల్లో బీజేపీకి మరో 19వేల వరకు సభ్యత్వాలు వచ్చాయనేది ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట.

టీఆర్ఎస్, బీజేపీ.. ఈ రెండు పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టాయనేది ఓ టాక్. ఆ క్రమంలో యువత కూడా పోటాపోటీగా ఈ రెండు పార్టీల్లో చేరిపోయారు. కౌన్సిలర్లుగా పోటీ చేద్దామని ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు అటో ఇటో మొత్తానికి ఏదో పార్టీ తీర్థం పుచ్చుకున్న సందర్భాలు కనిపించాయి. మొత్తానికి రానున్న రోజుల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది.

English summary
Adilabad district politics is heating up. The lotus is ready for to be a check on the rose perfume. Speed ​​increases of lotus power to keep the car lighter. The rivalry between the two parties appears to have clashed in the high range. TRS has been a political force since the beginning of the movement. Now BJP raise the hands to check the TRS party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X