AI: ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ ఏఐ కోర్సు..

ప్రస్తుతం టెక్నాలజీ అంతా అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై ఆధారపడే పరిస్థితి నెలకొంది. దీంతో ఏఐ నేర్చుకునేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ (IIITH).. నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NAMS), IHub-డేటా సహకారంతో "AI for Medical Professionals" పేరుతో 12 వారాల ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సు ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు వైద్యపరమైన సెట్టింగ్‌లలో కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.

రోగి సంరక్షణ, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి జ్ఞానం, నైపుణ్యాలను సమకూర్చడానికి ఈ కోర్సును రూపొందించారు. ఏఐ ఫండమెంటల్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, మెడిసిన్‌లో వాటి అప్లికేషన్లు వంటి కీలక అంశాలను కవర్ చేస్తూ కోర్సు ఉండనుంది. స్క్రీనింగ్, రోగ నిర్ధారణ, రోగ నిరూపణ, రోగి నిర్వహణను మెరుగుపరచడంపై దృష్టే టెక్నాలజీపై అవగాహన కల్పించనున్నారు. 24 రాష్ట్రాల్లోని 41 స్పెషాలిటీల నుంచి దాదాపు 200 మంది సీనియర్ వైద్య నిపుణులు నమోదు చేసుకున్నారు.

AI Course at International Institute of Information Technology Hyderabad

ప్రముఖ అధ్యాపకులు ఈ కోర్సు నేర్చుకునే వారికి మార్గదర్శకత్వం వహించనున్నారు. ఈ కోర్సును సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా తీసుకొచ్చారు. అభ్యాసకులు తమ ఆచరణలో AI పద్ధతులను సమర్థవంతంగా వర్తింపజేయడానికి ఈ కోర్సు వీలు కల్పిస్తుంది. వర్చువల్ లాంచ్‌కు IIITH డైరెక్టర్ ప్రొఫెసర్. P J నారాయణన్, NAMS ప్రెసిడెంట్ డాక్టర్.

శివ్ కుమార్ సారిన్, భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ నాయకత్వం వహించనున్నారు.ఆధునిక ఆరోగ్య సంరక్షణలో ఏఐ ప్రాముఖ్యతను ప్రొఫెసర్ నారాయణన్ నొక్కి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+