హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్-చికాగో... డైరెక్ట్ కనెక్షన్ విమాన సర్వీసు... ప్రారంభించనున్న ఎయిర్ ఇండియా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు డైరెక్ట్ కనెక్షన్ విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. జనవరి, 2021 నుంచి హైదరాబాద్-చికాగో మధ్య ఎయిర్ ఇండియా సంస్థ ఈ విమాన సర్వీసును ప్రారంభించనుంది. బోయింగ్ 777-200 విమానాలతో నడిచే ఈ సర్వీసుల్లో సీట్ల సామర్థ్యం 238 (8 ఫస్ట్ క్లాస్ + 35 బిజినెస్ క్లాస్ + 195 ఎకానమీ క్లాస్) ఉండనుంది. ఈ సర్వీసు అందుబాటులోకి రావడంతో హైదరాబాద్-అమెరికా మధ్య ఏటా 7లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

Recommended Video

Air India's Non-Stop Hyderabad-Chicago Flight From 15 January

విజయవాడ, విశాఖపట్నం, నాగ్‌పూర్, భువనేశ్వర్, రాజమండ్రి, భోపాల్, తిరుపతి లాంటి నగరాల నుంచి కూడా అమెరికాకు ఏటా దాదాపు 2,20,000 మంది ప్రయాణికుల డిమాండ్ ఉంది. దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారం లాంటి హైదరాబాద్‌లో ఈ సర్వీసు అందుబాటులోకి రావడంతో.. సమీప నగరాల్లోని ప్రయాణికులకు కూడా ఇది అనుకూలంగా మారనుంది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సీఈవో ప్రదీప్ మాట్లాడుతూ... 'అమెరికాలోని చికాగో, హైదరాబాద్‌ను కలిపే ఈ కొత్త కనెక్షన్ కొంతకాలంగా కనెక్టివిటీ కావాలని కోరుతున్న జాబితాలో ఉంది. ఈ సర్వీసును మన జాతీయ క్యారియర్ ఎయిర్ ఇండియా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కనెక్షన్‌తో నేరుగా హైదరాబాద్ నుంచి అమెరికాకు అమెరికా నుంచి హైదరాబాద్‌కు సులభతరమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. మరిన్ని దేశీయ, అంతర్జాతీయ నగరాలను కనెక్ట్ చేసే విమాన సర్వీసుల కోసం మేము నిరంతరం కృషి చేస్తున్నాము.' అని తెలిపారు.

Air India to begin Hyderabad-Chicago non-stop flight service from January 15

అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ వంటి అమెరికా దిగ్గజ కంపెనీలెన్నో హైదరాబాద్‌లో కొలువుదీరాయి. తెలంగాణ ప్రభుత్వ కృషి వల్ల హైదరాబాద్‌లోని అమెరికా ఆధారిత సంస్థల నుండి పెట్టుబడులు ఎన్నో రెట్లు పెరిగాయి. హైదరాబాద్ నుంచి ఐటి ఎగుమతులకు అమెరికా మొదటి గమ్యస్థానం. హైదరాబాద్ నుంచి మొత్తం ఐటీ ఎగుమతుల్లో దాదాపు 70% అమెరికాకే జరుగుతున్నాయి. హైదరాబాద్ నుండి అమెరికాకు డైరెక్ట్ విమాన కనెక్షన్ కావాలని చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది. త్వరలో ఎయిర్ ఇండియా శంషాబాద్ నుంచి అమెరికాకు డైరెక్ట్ కనెక్షన్ ప్రారంభించనుండటం కార్పొరేట్ వర్గాలకు ఎంతగానో ఉపయోగపడనుంది.
వ్యాక్సిన్ క్యాపిటల్‌గా,ఫార్మా క్యాపిటల్‌ గానూ హైదరాబాద్ పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజా విమాన సర్వీసుతో ఈ రెండు ప్రాంతాల మధ్య కోవిడ్ వ్యాక్సిన్‌ రవాణాకు లాజిస్టిక్ సదుపాయం సులభతరమవుతుంది.

English summary
Hyderabad is all set to get a non-stop connectivity with the United States as Air India will launch its direct flight from the city to Chicago from January 15. The national carrier will operate the flight bi-weekly, GMR-led Hyderabad International Airport announced on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X