Pollution In Hyderabad: హైదరాబాద్‍లో సడెన్‍గా పెరిగిన గాలి కాలుష్యం.. ఎందుకంటే
హైదరాబాద్ లో సడెన్ గా పోల్యూషన్ పెరిగిపోయింది. ఇంత సడెన్ ఎందుకు పెరిగిందని అనుకుంటున్నారా.. దీపావళి వల్ల గాలి కాలుష్యం పెరిగింది. సోమవారం రాత్రంతా పటాకులు పేల్చడంతో హైదరాబాద్‌లో గాలి నాణ్యత బాగా పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెబ్‌సైట్ డేటా ప్రకారం, అక్టోబర్ 18న నగరంలో సగటు గాలి నాణ్యత '8' వద్ద ఉంది. ఇది మంచిదే... కానీ దీపావళి సమీపిస్తున్న వేళ పటాకుల వేడుకలు పెరిగేకొద్దీ, గాలి నాణ్యతలో భారీ క్షీణతను కనిపించింది. మంగళవారం ఉదయం 07:06 గంటలకు '654'AIQ కి చేరుకుంది. ఇది 'ప్రమాదకర' స్థాయిగా శాస్ర్తవేతలు పేర్కొంటున్నారు.
గాలికాలుష్యం పెరిగితే శ్వాసకోశ సమస్యలు వస్తాయట. ముఖ్యంగా గాలి కాలుష్యం పెరిగితే చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బుందులు పడాతారు. ఆస్తమా ఉన్నవారికి శ్వాస సమస్యలు ఏర్పడతాయి . మంగళవారం ఉదయం 11:53 గంటలకు హైదరాబాద్‌లో గాలి నాణ్యత మార్గదర్శకాల విలువ ద్వారా సిఫార్సు చేయబడిన పరిమితి కంటే 8.2 రెట్లు ఎక్కువగా ఉందట.అలాగే, సనత్‌నగర్, న్యూ మలక్‌పేట్, సోమాజిగూడ, రామచంద్రపురం మానిటరింగ్ స్టేషన్‌లలోని నివాస ప్రాంతాలలో గాలి నాణ్యత సూచిక రాత్రి 11 గంటల ప్రాంతంలో 500 AIQ వద్ద ఉంది.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెబ్‌సైట్ డేటా ప్రకారం నాచారంలో అత్యధికంగా రాత్రి 11:00 గంటలకు 446 AIQ వద్ద ఉంది.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యొక్క AQI రీడింగ్‌లు 400కి పైగా ఉంటే గాలి ఎక్కువ స్థాయిలో కాలుషతమైనట్లు లెక్క. కాలుష్యం పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం టపాసులను నిషేధించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెబ్‌సైట్ డేటా ప్రకారం బంజారహిల్స్ లో 160 AIQ, సెట్రల్ యూనివర్శిటీలో 229 AIQ, మణికొండలో 133 AIQ ఉందట.












Click it and Unblock the Notifications