మోడీపై ఒవైసీ ఘాటు విమర్శలు, టోపీ, విజిల్ ఇస్తానంటూ సటైర్
హైదరాబాద్ : పోలింగ్ కు సమయం దగ్గరపడేకొద్దీ రాజకీయవేడి మరింత పెరుగుతోంది. అధికార, విపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ చేస్తున్న చౌకీదార్ క్యాంపెయిన్‌పై ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. నరేంద్రమోడీని టార్గెట్ చేసిన ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రధానిపై ఘాటు విమర్శలు చేశారు.
ఆధార్, ఓటర్ కార్డుల్లో పేరెందుకు మార్చుకోలేదు?
ప్రధాని నరేంద్రమోడీ తన పేరుకు ముందు చౌకీదార్ పదం చేర్చుకోవడాన్ని అక్బరుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. ఆదివారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ట్విట్టర్ అకౌంట్ లో మోడీ పేరుకు ముందు చౌకీదార్ పదాన్ని చేర్చుకోవడాన్ని తప్పుబట్టారు. చౌకీదార్‌లా దేశాన్ని కాపాడుతానంటున్న మోడీ.. ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులు, పాస్‌పోర్టులో తన పేరు ఎందుకు మార్చుకోలేదని ఒవైసీ ప్రశ్నించారు.

చాయ్‌వాలా పకోడీవాలా వద్దు సమర్థుడైన ప్రధాని కావాలి
దేశప్రజలు సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఒవైసీ అభిప్రాయపడ్డారు. జనం తన బాగోగులు పట్టించుకునే వ్యక్తి అధికారం చేపట్టాలనే తప్ప చాయ్‌వాలా, పకోడీవాలాను ప్రధానిగా చూడాలనుకోవడంలేదని చురకలంటించారు. ఒకవేళ మోడీ చౌకీదార్‌గా పనిచేయాలనుకుంటే తన వద్దకు వస్తే వాచ్ మెన్ టోపీ, విజిల్ ఇస్తానని సటైర్ విసిరారు.












Click it and Unblock the Notifications