Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vinayaka Immersion: వినాయకుడి నిమజ్జనం చూసేందుకు వెళ్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

గణనాథుల నిమజ్జనానికి అన్ని ఏర్పాటు చేశారు. గణేషుడి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వచ్చే వారు, నిమజ్జనం చూసేందుకు వచ్చే వారు పలు విషయాలు తెలుసుకోవాలి. గణేష్ విగ్రహం నిమజ్జనానికి తీసుకొచ్చే వారు వాహనంపై లౌడ్ స్పీకర్లు పెట్టుకోకూడదు. గణేశ్ విగ్రహం తీసుకెళ్లే వాహనంలో మద్యం లేదా ఏ ఇతర మత్తు పదార్థాలు ఉంచకూడదు. గణేశ్ విగ్రహ నిమజ్జనం కోసం వచ్చే వారు కర్రలు, ఏ ఇతర ఆయుధాలు ఉంచుకోకూడదు. జెండాలకు ఉపయోగించే కర్రలు రెండు అడుగుల పొడవు మాత్రమే ఉండాలి.

నిమజ్జనం ఊరేగింపులో రాజకీయ, రెచ్చగొట్ట ప్రసంగాలు చేయకూడదు. ఊరేగింపు సమయంలో బాణసంచా పేల్చరాదు. ఇక నిమజ్జనం చూడడానికి వచ్చే వారు తమ వాహనాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, ఎంఎంటీఎస్ స్టేషన్ ఖైరతాబాద్, ఆనంద్ నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఆఫీసులో పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే బుద్ధ భవన్ వెనుక, గౌసేవాస దన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ ఆలయం, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఐమాక్స్ పక్కన పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు.

All arrangements have been made for Ganesh immersion at Tank Bond in Hyderabad

ఇతర పనులపై ట్యాంక్ బాండ్ మీదుగా వెళ్లే వారు... అలాగే పలు ప్రాంతాల నుంచి వెళ్లే వారికి ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు.కేశవగిరి, చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్, ఇంజిన్ బౌలీ, శంశీర్‌గంజ్, నాగుల్ చింత, హిమ్మత్‌పురా, హరి బౌలి, ఆస్రా హాస్పిటల్, మొగల్‌పురా, లక్కడ్ కోటె, పంచ్ మొహలా, పారిస్ కేఫ్, గుల్జర్ హౌజ్, మిట్టి కా షేర్, కాలి కమాన్, ఒస్మాన్ బజార్, షెరాన్ హోటల్, మదీనా క్రాస్ రోడ్స్, నయాపూల్, ఎస్ జే రోటరీ, అర్మాన్ హోటల్, ఎంజే బ్రిడ్జీ, దారుల్ షిఫా క్రాస్ రోడ్స్, సిటీ కాలేజీ, శివాజీ బ్రిడ్జీ, అఫ్జల్ గంజ్, పుత్లి బౌలి క్రాస్ రోడ్స్, ట్రూప్ బజార్, జాంబాగ్ క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ కోఠి వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

అలాగే.. తోప్ ఖానా మసీదు, అలస్కా హోటల్ జంక్షన్, ఉస్మాన్ గంజ్, శంకర్ బాగ్, సీనా హోటల్, అజంతా గేట్, అబ్కారీ లేన్, తాజ్ ఐలాండ్, చాపెల్ రోడ్, ఏఆర్ పెట్రోల్ పంప్, ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, జీపీవో అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి స్టాచ్యూ, కవాడిగూడ, నారాయణగూడ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ఏరియాల్లో ఆంక్షలు ఉంటాయి. మరికొన్ని చోట్లా ఈ ఆంక్షలు ఉండనున్నాయి.

ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, జీపీవో అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి స్టాచ్యూ, కవాడిగూడ, నారాయణగూడ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా వద్ద కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇక ఖైరతభాద్ గణేషుడి శోభాయాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. శోభాయాత్ర ఖైరతాబాద్ నుంచి రాజ్ దూత్ హోటల్(లక్షీకపూల్)-టెలిఫోన్ భవన్-తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కగా సెక్రటేరియట్ ముందు నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు చేరుకుంటుంది. అక్కడే ఏర్పాటు చేసిన క్రేన్ నం.4 వద్ద మధ్యాహ్నం 1.30 గంటల లోపు నిమజ్జనం చేయనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+