బైబై గణేషా - శోభా యాత్ర ఇలా : ట్రాఫిక్ మళ్లింపు - అర్ద్రరాత్రి వరకు మెట్రో..!!
గణేషుడి నిమజ్జనోత్సవానికి రంగం సిద్దం అయింది. తొమ్మది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాధుడు సాగర తీరానికి బయల్దేరుతున్నాడు. బాలాపూర్ లడ్డూ వేలం తో మొదలయ్యే ఈ నిమజ్జనోత్సవ సంబురం దాదాపు 20 కిలో మీటర్ల మేర సాగనుంది. రాత్రికి అన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో పండుగ వాతావరణంలో జరిగే ఈ వేడుకల కోసం అన్ని శాఖల సమన్వయంతో పెద్ద ఎత్తున సిబ్బందిని మొహరించారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేసారు. ట్రాఫిక్ మళ్లించారు.

ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం
ఆర్టీసీ బస్సులకు అవకాశం లేకపోవటం తో అర్ద్రరాత్రి రెండు గంటల వరకు మెట్రో సేవలు కొనసాగించాలని నిర్ణయించారు. మధ్నాహ్నం 3 గంటల లోగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేయనున్నారు. దాదాపుగా 10,470 మంది సిబ్బందిని సిద్దం చేసారు. ట్యాంకుబండ్ వరకు 565 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. నగరంలోని మద్యం దుకాణాలను రెండు రోజుల మూసివేసారు. బందోబస్తు కోసం దాదాపుగా 35 వేల పోలీసు సిబ్బందిని మొహరించారు. పోలీస్ కమిషనర్లు ఆనంద్, మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర నిమజ్జనం పూర్తయ్యే వరకూ పూర్తిగా పర్యవేక్షించనున్నారు. తెల్లవారుజామున నాలుగింటి వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. శోభాయాత్ర దారుల్లో సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
రాత్రికే నిమజ్జనం పూర్తయ్యేలా
ఉత్సవం ప్రశాంతంగా ముగిసేలా ప్రజలందరూ సహకరించాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర విన్నవించారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 12 కిలోమీటర్ల మేర డబుల్ లేయర్ భారీగేటతోపాటు నిరంతర పర్యవేక్షణకు కంట్రోల్ రూం, వాచ్‌టవర్లను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి 50 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సుమారు 70 టన్నుల బరువున్న ఖైరతాబాద్ మహాగణపతిని తరలించేందుకు ఈ ఏడాది అత్యాధునిక ట్రాలీ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరి ఖైరతాబాద్ గణేశుడిని ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నం.4 వద్దే నిమజ్జనం చేస్తారు.
అర్ద్రరాత్రి వరకు మెట్రో
ఖైరతాబాద్ శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్ర ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతుంది. సెన్షెన్ థియేటర్, ఐఐఎంసీ కళాశాల చౌరస్తా, టెలిఫోన్ భవన్, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న క్రేన్ నం.4 వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు చేరుకుంటుంది. తుది పూజల అనంతరం మధ్యాహ్నం 3లోపు నిమజ్జనం పూర్తి చేస్తారు.
నిమజ్జనం సందర్భంగా విద్యుత్ సరఫరా తీరును సమీక్షించేందుకు హుస్సేన్‌సాగర్ తీరంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసారు. నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఉచిత తాగునీటిని అందించేందుకు జలమండలి అన్ని ఏర్పాట్లు చేసింది.

బందోబస్తు.. సిబ్బంది ఏర్పాటు
గ్రేటర్‌వ్యాప్తంగా జరిగే నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా జంటనగరాల్లో ఈనెల 9,10 తేదీల్లో 8 ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు నడుపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. రోజువారీ సర్వీసులకు అదనంగా శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తాయన్నారు. భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో మెట్రోరైళ్లను శుక్రవారం అర్ధరాత్రి 1 గంట వరకు నడుపుతున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. చివరి రైలు రాత్రి 1 గంటకు రైలు బయల్దేరి 2 గంటలకు ఆఖరి స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. ఉదయం 6 గంటల నుంచే సర్వీసులు ప్రారంభమవుతాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications