OYO Rooms: రాత్రికి రాత్రే ఓయో రూమ్స్.. గిరాకీ కూడా భారీగానే..!
హైదరాబాద్ లో ఓయో రూమ్స్ భారీగా పెరుగుతోన్నాయి. రాత్రికి రాత్రే బిల్డింగ్ లకు ఓయో బోర్డు పెట్టేస్తున్నారు. విషయమేమిటంటే ఓయో రూమ్స్ రెసిడెన్షియల్ పేరు మీదనే కొనసాగుతోన్నాయి. నిజనికైతే ఓయో రూమ్స్ కమర్షియల్. కానీ అధికారుల నిర్లక్ష్యం, మాముళ్లు తీసుకోవడంతో ఓయో రూమ్స్ రాత్రికి రాత్రే ఏర్పాటు అవుతున్నాయి.
దీని వల్ల జీహెచ్ఎంసీ నష్టపోతోంది. దీంతో ఈ విషయమై కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తారు.ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తేనే బల్దియా పనులు చేయగలుగుతామని, రెసిడెన్షియల్ పర్పస్ లో పర్మిషన్లు తీసుకొని రాత్రికి రాత్రే కమర్షియల్ గా మార్చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఓయో రూమ్స్ రెసిడెన్షియల్ కాలనీల్లో ఏర్పాటు చేస్తున్నారని.. వీటి వల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఓయో రూమ్స్ నిబంధనలపై క్రాస్ చెక్ చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఓయో హాస్టల్‌పై విచారణ చేసి టాక్స్‌పై చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ చెప్పారు. సెల్ఫ్ అసిస్మెంట్‌పై త్వరలోనే పూర్తి ప్రకటన చేస్తామని పేర్కొన్నారు.
జీఐఎస్ (GIS) మ్యాప్‌ను జీహెచ్‌ఎంసీ త్వరలోనే మళ్ళీ గ్రౌండ్ చేస్తామన్నారు. ఓయో రూమ్స్ బుకింగ్ కూడా బాగానే ఉన్నాయట.డిసెంబర్ 31వ తేదీన ఒక్క రోజే ఏకంగా 4.5 లక్షల ఓయో రూమ్ బుకింగ్స్ జరిగాయి. ఓయో రూమ్ రికార్డ్ స్థాయిలో జరగడంతో పాటు కండోమ్‌లు కూడా అంతే మొత్తంలో అమ్ముడు పోయాయట. ఫిబ్రవరి 14 న ఓయో రూమ్స్ బుకింగ్స్ అండ్ కండోమ్స్ అధిక మొత్తంలో అమ్ముడుపోయాయని తెలుస్తోంది. హైదరాబాద్ లో కూడా ఓయో రూమ్స్ భారీగా బుక్ అయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications