ఇందిరా పార్క్ వద అంబేడ్కర్ వాదుల మహాగర్జన..! కదం తొక్క నున్న ఎంఆర్పీఎస్..!!
హైదరాబాద్: తెలంగాణలో మందకృష్ణ మాదిగ తన కార్యకలాపాలను ఉద్రుతం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొన్నాళ్లు నిశ్శబ్దంగా మారిపోయిన ఎంఆర్పీయస్ కార్యక్రమాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. గత నెలలోనే పంజాగుట్ట చౌరస్తాలో దాదా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ద్వంసం చేసింనందుకు నిరధనగా భారీ బహిరంగ సభకు ఉపక్రమించారు మందకృష్ణ. కాని పోలీసులు ఆ కార్యక్రమానికి అనుమతిని నిరాకరించారు. తాజాగా ఆంక్షల మద్య ఇందిరా పార్క్ వద్ద నేడు అదే కార్యక్రమం నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద 'అంబేడ్కర్‌వాదుల మహాగర్జన సభ' జరగనుంది.
పంజాగుట్టలోని అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించినందుకు, అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రశేఖర్ రావు పాల్గొనక పోవటాన్ని నిరసిస్తూ ధర్నాచౌక్ వద్ద మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఈ సభను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, వివిధ పార్టీల నేతలను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. సభాస్థలాన్ని మందకృష్ణ మంగళవారం సందర్శించారు.

టీఆర్‌ఎస్ మినహా అన్ని పార్టీల అగ్రనేతలు పాల్గొనే ఈ సభకు వేలాది మంది హాజరవుతారని, భారీ ఎత్తున నిర్వహించేందుకు సహకరించాలని పోలీసులను కోరారు. సభను ఒక మూలకు నిర్వహించాలని పోలీసులు అంటున్నారని, అలా అయితే వేలాదిగా వచ్చే అంబేడ్కర్ వాదులకు ఇబ్బంది కలుగుతుందని మందకృష్ణ విజ్నప్తి చేసారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications