జగన్ పార్టీకి షర్మిల దెబ్బ! -తొలి వికెట్? -బ్రదర్ అనిల్‌తో ఆ దంపతులు భేటీ -లోటస్‌పాండ్‌కు విజయమ్మ
తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలను చర్చకు పెడుతూ, వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీని స్థాపించే దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. తన సోదరుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ జోలికి షర్మిల వెళ్లబోనని, తెలంగాణలో రాజన్నరాజ్య స్థాపనే ధ్యేయంగా పనిచేస్తారని ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ వరుసగా చోటుచేసుకుంటోన్న పరిణామాలు మాత్రం చెల్లెలి పార్టీతో అన్న పార్టీకి అంతో ఇంతో దెబ్బ తప్పదనే సంకేతాలిస్తున్నాయి. ప్రధానంగా..
అడ్డంగా దొరికిన జగన్ -పోస్కోతో డీల్ బయటపెట్టిన కేంద్రం -విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ ఫైర్

సెటిలర్లలో చీలిక..
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు, ఆయన నేతృత్వంలోని వైసీపీకి హైదరాబాద్ లోని సెటిటర్లలో గొప్ప ఆదరణ ఉంది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఆ విషయం స్పష్టంగా రుజువైంది. దివంగత వైఎస్సార్ ను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కామెంట్లను తప్పు పడుతూ సెటిలర్లయిన వైఎస్ అభిమానులంతా బీజేపీని టార్గెట్ చేయడంతో చివరికి రఘునందన్ దిగొచ్చి క్షమాపణలు కూడా చెప్పారు. హైదరాబాద్ లో నివసిస్తోన్న ఏపీ ఆరిజిన్స్ లో వైఎస్ అభిమానులుగా కొనసాగుతోన్న వారిలో షర్మిల కొత్త పార్టీ ద్వారా చీలిక ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో వైసీపీ యాక్టివ్ గా లేకపోవడం, జగన్ వద్దంటున్న షర్మిల పార్టీ పెట్టడం లాంటి పరిణామాలు సెటిలర్లలో చీలికకు దారితీయొచ్చనే చర్చ జరుగుతోంది. ఆ చర్చను మరింత బలపర్చినట్లుగా..

షర్మిల భర్తతో యాకర్ శ్యామల భేటీ..
వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్ద సంఖ్యలో ఉన్న అభిమానుల ద్వారా హైదరాబాద్ లో తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. హైదరాబాద్ లో శాశ్వత నివాసం ఏర్పర్చుకున్న సినీ, టీవీ రంగాలకు చెందిన ప్రముఖులు చాలా మంది వైసీపీలో చేరిపోయి, ఏపీకి వెళ్లి ఎన్నికల ప్రచారం కూడా చేసొచ్చిన సంద్భాలు గతంలో చాలా ఉన్నాయి. అలా జగన్ సమక్షంలోనే వైసీపీలో చేరి, ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేసి, ఇప్పటికీ సభ్యురాలిగానే కొనసాగుతోన్న ప్రముఖ టీవీ యాంకర్ శ్యామల బుధవారం హైదరాబాద్ లో షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ను కలుసుకున్నారు. ఈ భేటీపై..

బ్రదర్ అనిల్ బర్త్ డే వేడుకలు
వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్న దరిమిలా హైదరాబాద్ లో ఉంటూ ఇన్నాళ్లూ వైసీపీకి, జగన్ కు మద్దతుదారులుగా ఉన్న కొందరు ప్రముఖులు ఆమెను కలుస్తున్నట్లు సమాచారం. అయితే, యాంకర్ శ్యామల మాత్రం షర్మిల భర్త అనిల్ తో తాము భేటీ కావడం వెనుక రాజకీయ ఉద్దేశాలేవీ లేవనే అర్థంలో పోస్టులు పెట్టారు. శ్యామల, టీవీ నటుడైన ఆమె భర్త నర్సింహారెడ్డిలు లోటస్ పాండ్ లో బ్రదర్ అనిల్‌తో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్యామల.. హ్యాపీ బర్త్, ఫ్రెండ్లీ మీట్, బ్రదర్ అనిల్ కుమార్ అన్న అని హ్యాష్ ట్యాగ్‌లు పెట్టారు. కాగా,

జగన్ నుంచి పదవి కోరలేదు..
ఇప్పటికీ వైసీపీ సభ్యులుగానే ఉన్న యాంకర్ శ్యామల, ఆమె భర్త నర్సింహారెడ్డి ఇవాళ బ్రదర్ అనిల్ ను కలిసిన తర్వాత పాతముచ్చట్లను రిపీట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. తాను వైసీపీకి దూరం కాలేదని, జగన్ పాలన అద్భుతంగా సాగుతోందంని యాంకర్ శ్యామల కొద్ది రోజుల కిందట చెప్పిన విషయాలు మళ్లీ చర్చకు వచ్చాయి. పెద్దవాళ్లను అకారణంగా డిస్ట్రబ్ చేయడం ఇష్టంలేకే జగన్ ను కలవలేదన్న శ్యామల.. ప్రభుత్వం నుంచి తాను ఎలాంటి పదవిని ఆశించలేదని స్పష్టంచేశారు. ఇప్పుడు కూడా వైఎస్ కుటుంబంపై అభిమానంతోనే షర్మిల భర్తను కలిశానని చెప్పుకొచ్చారు. మరోవైపు..

లోటస్‌పాండ్‌కు వైఎస్ విజయమ్మ
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన వేళ.. హైదరాబాద్ లో ఆమె ఉంటోన్న లోటస్ పాండ్ నివాసానికి తల్లి వైఎస్ విజయమ్మ కూడా వచ్చినట్లు తెలుస్తొంది. బుధవారం బ్రదర్ అనిల్ పుట్టినరోజు కావడంతో ఆ వేడుకలో పాల్గొనేందుకే విజయమ్మ వచ్చారని సమాచారం. లోటస్ పాండ్ కు విజయమ్మ రాకపై షర్మిల పార్టీ, వైసీపీ నేతలెవరూ స్పందించలేదు. తొలుత నల్గొండ జిల్లాలోని వైఎస్ అభిమానులతో భేటీ అయి, కొత్త పార్టీ పనుల్ని వేగవంతం చేసిన షర్మిల.. ఈనెల 20న ఖమ్మం జిల్లాలోని వైఎస్ అభిమానుల్ని కలవనున్నారు. తెలంగాణ వైఎస్సార్‌సీపీ పేరుతో షర్మిల మార్చిలో పార్టీని ప్రారంభిస్తారని జోరుగా చర్చ జరుగుతోంది.