Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం..!
కేంద్రం ఎన్ని హెచ్చరికలు చేసినా విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా మరోసారి విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆదివారం ఉదయం గోవా నుంచి కలకత్తా వెళ్తోన్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది ఫ్లైట్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయ ఏటీసీ అధికారులతో పైలట్ మాట్లాడి.. రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. వెంటనే ప్రయాణికులను కిందికి దించి తనిఖీలు చేపట్టారు.
తనిఖీల్లో ఎలాంటి పదార్థాలను గుర్తించలేదు. విమానంలో సిబ్బందితో పాటు 180 మంది ఉన్నట్లు సమాచారం. ఈ విమానానికే కాకుండా మరో రెండు విమానాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు విమానంలో సోదాలు చేసి ఏం లేదని చెప్పారు. అలాగే హైదరాబాద్ నుంచి పూణే వెళ్తోన్న విమానంలో కూడా బాంబు ఉందని గుర్తు తెలియనవారు సమాచారం ఇచ్చారు. ఆ విమానంలో కూడా తనిఖీలు చేపట్టి ఏం లేదని తేల్చారు.

బెదిరింపుల నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. విమానాలకు బెదిరింపు కాల్స్ పై కేంద్ర సీరియస్ గా ఉంది. అయినప్పటికీ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఈ బెదిరింపులు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. దీనిపై పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం జరుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మెహన్ నాయుడు చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఇక నుంచి ఏవియేషన్ చట్టాల్లో కీలక సవరణలు చేస్తామని చెప్పారు. విమానాలకే కాకుండా రైళ్లకు కూడా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. రైల్లో బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి ఏం లేదని తేల్చింది. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications