హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాంకరింగ్ టు పాలిటిక్స్..? రాజకీయాల్లోకి అనసూయ, ఆదర్శంగా రోజా

|
Google Oneindia TeluguNews

యాంకర్ అనసూయ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకతను సంపాదించారు ఆమె. ఇటీవల ఓ పోస్టల్ స్టాంప్‌పై అనసూయ ఫోటోను ముద్రించారు. దీంతో ఆమె ఉబ్బి తబ్బాయి పోయారు. యాంకర్‌గా సాధించాల్సిన పేరు, ప్రఖ్యాతలను పొందారు. ఇక వాట్ నెక్ట్స్ అని ఆలోచించారు. ఇంకేముంది జబర్దస్త్ జడ్జీ రోజాను ఫాలో అయిపోతానని సంకేతాలు ఇచ్చారు. తాను కూడా రాజకీయ రంగంలోకి అడుగిడుతానని చెప్పారు. అనసూయ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు.. కానీ ఏ పార్టీ అన్న అంశంపై ఇప్పటికైతే స్పష్టత లేదు.

యాంకర్ అనసూయ..

యాంకర్ అనసూయ..

జబర్దస్త్ షోలో జడ్జీగా రోజా వ్యవహరిస్తే వ్యాఖ్యాతగా అనసూయ కూడా ఉన్నారు. ఆమె సినిమాలను వదిలి.. రాజకీయాల్లోకి వెళితే.. ఈమె యాంకరింగ్ వదిలేసి పాలిటిక్స్‌లోకి ఎంటర్ కావాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ పూర్తయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన రోజా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు కూడా. ఆ తర్వాత ఎంతో పట్టుదలతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

 అపప్రద ఉండేది.. కానీ

అపప్రద ఉండేది.. కానీ

రోజా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాదు అనే అపప్రద కూడా ఉండేది. పార్టీ అధికారంలోకి వచ్చినా.. రోజా విజయం సాధించారనే అభిప్రాయం ఉండేది. కానీ రెండోసారి రోజా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె ప్రాతినిథ్యం వహిస్తోన్న వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి కూడా వచ్చింది. ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రోజాకు మంత్రి పదవీ ఇద్దామనకున్నారు. కానీ క్యాస్ట్ ఈక్వెషన్స్ వల్ల మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. మంత్రి పదవీకి సమానమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవీని ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఉంటూనే ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటు బబర్ధస్త్ వంటి కామెడీ షోలకు జడ్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇల్లాలుగా తన వంతు బాధ్యతను చక్కగా నిర్వహిస్తూ వస్తున్నారు.

అభిమానుల డిమాండ్

అభిమానుల డిమాండ్

రోజాను ఆదర్శంగా తీసుకుంటున్నారు అనసూయ. అందుకే రాజకీయాల్లోకి వస్తానని ఇండికేషన్స్ ఇస్తున్నారు. పాలిటిక్స్‌లోకి రావాలని అనసూయ అభిమానులు కూడా కోరుతున్నారు. తెరపై కనిపించే అనసూయ.. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలతో కలసిపోవాలని అంటున్నారు. రాజకీయాల్లోకి అనసూయ రావడం పక్కా.. కానీ ఎప్పుడనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు.

English summary
anchor anasuya to be enter politics shortly sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X