3 రోజులు వర్షాలు: ఏపీ, తెలంగాణకు కూడా.. ఎక్కడెక్కడ అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. వచ్చే మూడు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దాని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.
ఇటు హైదరాబాద్ నగరంలో సోమవారం వాన దంచికొట్టింది. వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. వాన కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. శేరిలింగంపల్లి, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్‌లో 4.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. చార్మినార్, ఖైరతాబాద్‌లో 4 మి.మీ. వర్షపాతం రికార్డైంది. నిజామాబాద్ డిచ్‌పల్లిలో అత్యధికంగా 27 మి.మీ, సిరికొండలో 26.8 మి.మీ, బోధన్‌లో 25.5 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఇటు ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవొచ్చని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే చాన్స్ ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. కరెంట్ పోల్స్, విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని జాగ్రత్తలు తెలియజేసింది. ఇటు మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. తెల్లవారుజాము 5 గంటలకు కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. 5 నిమిషాలు కరెంట్ లేకున్నా.. ఇబ్బంది పడుతున్నారు. అప్పుడప్పుడు వర్షం కురుస్తోంది. కానీ ఆ తర్వాత ఉక్కపోత మాత్రం తప్పడం లేదు.












Click it and Unblock the Notifications