శంషాబాద్‌లో మరో మహిళ శవం...! కాలుతున్న శవాన్ని గుర్తించిన స్థానికులు...!!

శంషాబాద్‌లో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. ప్రియాంక రెడ్డి హత్య ఉదంతం జరిగి సంచలనం సృష్టించిన కొద్ది గంటల్లోనే మరో మహిళ శవం బయటపడింది. శంషాబాద్ సమీపంలోని సిద్దుల గుట్ట రొడ్డులో గల మైసమ్మ గుడి పక్కన ఉన్న ప్రహరీ గోడ వద్ద గుర్తు తెలియని శవాన్ని స్థానికులు గుర్తించారు. మహిళను హత్యచేసి కిరోసిన్‌ పోసి కాల్చినట్టు అనవాళ్లు ఉన్నాయి. అయితే శవం కాలుతుండగానే స్థానికలు 100కు ఫోన్ చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.

శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో దారుణం వెలుగు చూసింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దుల గుట్ట రోడ్డులోని మైసమ్మ దేవాలయం సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ శవం బయటపడింది. అయితే శుక్రవారం రాత్రి శవం కాలిపోతుండగా స్థానికులు గుర్తించారు. ఇక పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకునే సరికి గుర్తపట్టలేని విధంగా శవం ఉన్నట్టు తెలుస్తోంది. ఎక్కడో చంపి శవాన్ని దేవాలయం సమీపంలో వేసి కాల్చివేసినట్టగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా మహిళ శవం లభించిన సమీప ఆలయంలో అయ్యప్ప స్వాములు చూసి పోలీసులకు విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. ఉదయం , సాయంత్రం సమయాల్లో అయ్యప్ప స్వాములు గుడికి వస్తుంటారని తెలుస్తోంది. సంఘటనపై పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

another woman deadbody was found at Shamshabad

మహిళ శవం లభించిన చోటు నిర్మాష్యంగా ఉందని చెబుతున్నారు. దీంతో అక్కడ సీసీ కెమెరాలు కూడ లేవని తెలుస్తోంది. ఒక్కరోజులోనే శంషాబాద్‌లో రెండు సంఘటనలు జరగడం కలకలం రేపుతోంది. ఓ వైపు ప్రియాంక రెడ్డి మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేగుతుండగా ఒక్కరోజు తేడాలోనే మరో మహిళ శవం బయట పడడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నగర శివారులో ఎం జరుగుతుందనే కోణంలో దృష్టి సారించారు. ప్రియాంక హత్యతో పలు విమర్శలు ఎదుర్కొంటున్న పోలీసులకు మరో శవం సవాల్ విసిరింది. దీంతో హత్య మిస్టరీపై పోలీసులు దృష్టి సారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+