వ్యాక్సినేషన్ డ్రైవ్.. ఇప్పుడు అపోలో వంతు, బుధవారం 50 నగరాల్లో..
కరోనాకు టీకాతోనే చెక్ పెట్టొచ్చు.. ఈ విషయాన్ని వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. తొలుత టీకా వేసుకోవాలంటే జనం జంకారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వ్యాక్సిన్ తీసుకోవడానికి జనం ముందుకొస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రోజుకు 100 మందికి మాత్రమే ఇస్తున్నారు. దీంతో మిగతావారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అయితే ప్రైవేట్ ఆస్పత్రులు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. ఇదివరకు మెడికవర్ కండక్ట్ చేయగా.. ఇప్పుడు అపోలో చేస్తోంది.

వ్యాక్సిన్ డ్రైవ్
దేశవ్యాప్తంగా జూన్ 30వ తేదీ (బుధవారం) వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అపోలో హాస్పిటల్స్ తెలిపింది. దేశంలోని 50 నగరాల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 200కి పైగా అపోలో వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా డ్రైవ్ నిర్వహిస్తామని అపోలో హెల్త్‌కేర్ ప్రకటన చేసింది. వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకుంటున్న ప్రజలు అపోలో 24/7 యాప్ ఉపయోగించి స్లాట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే సమీప అపోలో టీకా కేంద్రాన్ని సందర్శించి టీకాలు వేయించుకోవాలని కోరారు.

ఫిజికల్ డిస్టన్స్
అన్ని టీకా కేంద్రాలలో బౌతికదూరం పాటిస్తూ..వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 10 వేల మందికి పైగా సిబ్బందిని అందుబాటులో ఉంచామని అపోలో చెబుతోంది. సురక్షితమైన టీకా ప్రోటోకాల్స్ పాటించేందుకు వారికి శిక్షణ ఇచ్చినట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ శోభనా కామినేని వెల్లడించారు. డ్రైవ్ వల్ల గరిష్ట సంఖ్యలో వ్యాక్సిన్‌లు వేయడానికి వీలు కల్పిస్తుందని, మూడవ వేవ్ తగ్గించి, మనం తిరిగి సాధారణ జీవితాన్ని గడిపేందుకు వ్యాక్సిన్ వేయించుకోవడం ముఖ్యమని, అపోలో దీనిపై దృష్టి పెడుతుందని శోభనా కామినేని పేర్కొన్నారు.

వి సపోర్ట్..
జూలై 2021 నాటికి 500 మిలియన్ల వ్యాక్సిన్లను అందించే లక్ష్యాన్ని సాధించడంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి అపోలో నిబద్ధతలో తన వంతు సాయం చేస్తుందని ఆమె చెబుతున్నారు. అపోలో హాస్పిటళ్లు దేశవ్యాప్తంగా 72 ఆసుపత్రులలో 12వేల పడకలను కలిగి ఉన్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications