Hyderabad: హైదరాబాదీలకు శుభవార్త.. రెండేళ్ల వరకు ఢోకా లేదు..!

మొన్న వేసవి కాలంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు వచ్చాయి. నాగార్జునసాగర్ లో నీరు డెడ్ స్టోరేజీకి చెరడం, మంజీరాలో కూడా నీరు సరిగా లేకపోవడంతో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నీటి సమస్యలు వచ్చాయి. అయితే ఈ వర్షాకాలం సమృద్ధి వర్షాలు కురిశాయి. దీంతో ప్రాజెక్టులు నిండిపోయాయి. ప్రాజెక్టులు నిండిపోవడం వల్ల హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు ఉండని చెబుతున్నారు. నాగార్జునసాగర్ పూర్తిగా నిండిపోయింది.

ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తి నిండిపోయింది. మంజీరా కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్( గండిపేట), హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు పూర్తిగా నిండాయి. జలాశయాలన్నీ నిండిపోవడంతో రెండేళ్ల వరకు నీటి కష్టాలు ఉండవని అంచనా వేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ నీటి సామర్థ్యం 3.90 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం నీటి నిల్వ 3.430 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు.

As all the projects are filled up it is as if the water woes have been avoided for the Hyderabadis

ఇక హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 1761.10 అడుగులకు చేరినట్లు అధికారులు చెప్పారు. అయితే ఇళ్లు నిర్మించుకునే వారు తప్పని సరిగా ఇంకుడు గుంతులు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేస్తే భూ గర్భ జల మట్టాలు పెరుగుతాయని చెబుతున్నారు. హైదరాబాద్ అంతా కాంక్రీట్ జంగల్ గా మారిన నేపథ్యంలో ఇంకుడు గుంతలు అవసరమని వివరిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి వర్షాలతో హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు తప్పినట్లే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+