విలీన వజ్రోత్సవం: అమిత్ షాకు అసదుద్దీన్ లేఖ.. కేసీఆర్‌కు కూడా

తెలంగాణ విలీన వజ్రోత్సవ వేడుకులను నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆ లేఖ ప్ర‌తిని హైద‌రాబాద్‌లో మీడియాకు విడుద‌ల చేశారు. లేఖలో ప్ర‌స్తావించిన అంశాల‌ను వెల్ల‌డించారు. సెప్టెంబ‌ర్ 17న జాతీయ స‌మైక్య‌తా దినాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని తాను ఆ లేఖ‌లో అమిత్ షాను కోరానని ఓవైసీ తెలిపారు.

అమిత్ షాకు లేఖ

అమిత్ షాకు లేఖ

లేఖను అమిత్ షాతోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా ఓవైసీ పంపారు. ఆ తర్వాతనే మంత్రివర్గ సమావేశం జరిగింది. అసద్ అభిప్రాయాన్ని కూడా మంత్రివర్గ సమావేశం పరిగణలోకి తీసుకుంది. జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తామని చెబుతుంది. సెప్టెంబ‌ర్ 17వ తేదీన పాత‌బ‌స్తీలో తిరంగా యాత్ర‌తోపాటు బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మానికి త‌మ పార్టీ ఎమ్మెల్యేలంతా హాజ‌ర‌వుతార‌ని వివరించారు.

కేసీఆర్‌కు ఆహ్వానం

కేసీఆర్‌కు ఆహ్వానం

సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానిస్తామ‌ని తెలిపారు. సెప్టెంబ‌ర్ 17న హైద‌రాబాద్ సంస్థానం భార‌త దేశంలో విలీన‌మైంద‌ని ఆయ‌న తెలిపారు. తెలంగాణ విమోచ‌నం కోసం హిందువులు, ముస్లింలు క‌లిసి పోరాటం సాగించార‌ని ఓవైసీ తెలిపారు. ఇటు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంతకుముందు వెల్లడించారు. రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలను సమన్యయం చేసుకొని వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముగ్గురు సీఎంలకు లేఖలు రాయనున్నట్టు వెల్లడించారు.

విలీనం

విలీనం

1947 ఆగస్ట్ 15వ తేదీన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ తెలంగాణ ప్రత్యేక రాజ్యంగా ఉండటం వల్ల కలువలేదు. నిజాం రాజు విలీనం చేయకపోవడంతో.. అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ సైనిక చర్యను చేపట్టారు. దీంతో సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనం జరిగింది. ఆ సెలబ్రేషన్స్ చేసుకుందామని.. బీజేపీ ఎప్పటినుంచో కోరుతుంది. అదీ ఈ సారి నెరవేరబోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+