భర్తపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే..సామూహిక అత్యాచారం చేశారు
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి.ఇటీవలే ఏపీలో ఓ చిన్నారిపై ముగ్గురు మైనర్ పిల్లలు అత్యాచారం చేసి, హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ బాలిక మృతదేహం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఈ ఘటన మరువక ముందే హైదరాబాద్‌లో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆటో డ్రైవర్ అతని స్నేహితులు కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇంటి గొడవలపై భర్తపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. భర్తపై ఫిర్యాదు చేసి తిరిగి ఇంటికి చేరుకున్న క్రమంలో క్యాబ్-అగ్రిగేటర్ ద్వారా ఆటో-రిక్షాను బుక్ చేసింది. పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వస్తుండగా రైడ్-హెయిలింగ్ డ్రైవర్ మరియు అతని సహచరులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటన గత గురువారం (జూలై 13 తెల్లవారుజామున) జరిగింది ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఆటో డ్రైవర్ చాలా దూరం ప్రయాణించి మద్యం సేవిస్తున్న అతని ఇద్దరు స్నేహితులను తనతో పాటు తీసుకువెళ్లాడని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. వారు మహిళను మద్యం సేవించాలని కూడా ఒత్తిడి చేశారు. దానికి నిరాకరించడంతో ఆ యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.
అక్కడ ఆమెను బెదిరించి కారులో ఎక్కించి అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఆమెను అక్కడే వదిలేసి డ్రైవర్ అతని స్నేహితులు పారిపోయారు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆ యువతి ప్రధాన రహదారిపైకి చేరుకుని..100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications