అయ్యాయ్యో వద్దమ్మ: బండి అడగొద్దు.. ఎందుకంటే
అయ్యాయ్యో వద్దమ్మ.. టీ పౌడర్ యాడ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. యాడ్ తర్వాత కుర్రాడు శరత్.. ఓ బరాత్‌లో డాన్స్ చేసి హైప్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత మిగతా చోట్ల.. జనం ఫాలొ అయ్యారు. తర్వాత పోలీసులు కూడా ఇదే విధంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఏ ఫంక్షన్, పెళ్లి, బరాత్ అయినా.. అయ్యాయ్యో వద్దమ్మా అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. ఇప్పుడు టూ వీలర్ గురించి కూడా హంగామా చేస్తున్నారు.

బండి అడగొద్దు
పెట్రో, డీజిల్ ధరల రేట్లు పెరుగుతున్నాయి. దీంతో జనం బయటకు తిరగలేని పరిస్థితి నెలకొంది. దాంతో అయ్యాయ్యో వద్దమ్మ దయచేసి బండి అడగొద్దు అని నెంబర్ ప్లేట్ మీద రాసుకున్నారు. ఇదీ కాస్త వైరల్‌గా మారింది. నంబర్ ప్లేట్ మీద రాసి.. ట్రోల్ చేస్తున్నారు. లీటర్ పెట్రోల్ ధర రూ.116గా ఉంది. దయచేసి బండి అడగొద్దు అని రాసుకున్నారు.

శరత్ వల్లే
అంతకుముందు హైదరాబాద్‌కు చెందిన శరత్.. ఓ రోజు పెళ్లి డ్యాన్స్‌లో భాగంగా డ్యాన్స్ వేస్తూ సరదాగా.. 'అయ్యయ్యో వద్దమ్మా.. ఆ పక్కనే టీ కొట్టు ఉంది. అందరికీ ఓ కప్పు టీ ఇద్దామనుకున్నా.. సుఖీభవ.. సుఖీభవ..' అంటూ పాట పాడి తీన్మార్ స్టెప్పు లేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వైరల్ అవడమే కాదు.. రాత్రికి రాత్రే శరత్ సెలబ్రిటీ కూడా అయిపోయాడు. ఓవర్ నైట్ లో యూట్యూబ్ స్టార్ అయ్యాడు

ఖాకీలు కూడా
అంతకుముందు హైదరాబాద్ పోలీసుల కూడా అలా చేశారు. వారు జనాలకు అవగాహన కల్పించేందుకు అయ్యాయ్యో వద్దమ్మా అంటున్నారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో చెప్పి.. అయ్యాయ్యో వద్దమ్మా అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతోనైనా జనానికి అవగాహన వస్తుందని భావిస్తున్నారు. బహుమతి గెలుచుకున్నారు.. అభినందనలు.. అవార్డును పొందడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. అంటూ వచ్చే మెసేజ్‌లను నమ్మకండి అంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఎప్పుడూ సజెస్ట్ చేస్తారు. కానీ వాటికి అయ్యయ్యో వద్దమ్మా.. అనేసేయండి.. అంటూ హైదరాబాద్ సిటీ, సైబర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు. వారు ఫన్నీగా ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అయ్యాయ్యో వద్దమ్మ అనే పదం జనాలకు మంచిగానే వెళుతుంది.

ఇదీ నేపథ్యం
ఓ టీ పౌడర్ కంపెనీ.. కొన్ని రోజుల కింద ఓ యాడ్ చేసింది. ఆ యాడ్‌లో ఓ ట్రాన్స్‌జెండర్.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఓ కారు దగ్గరికి వెళ్లి డోర్ కొడుతుంది. ఆ ట్రాన్స్‌జెండర్‌ను చూసి కారులో కూర్చున్నపెద్దావిడ.. విసిగించడానికి వస్తారు ఎక్కడి నుంచో అని కారు గ్లాస్ తీసి 10 రూపాయలు ఇవ్వబోతుంది. అయ్యయ్యో వద్దమ్మా.. ఈ పక్కనే నా టీకొట్టు ఉందమ్మా.. అందరికీ ఓ కప్పు టీ ఇద్దామనుకున్నాను. అని చెప్పి టీ తెచ్చి ఇస్తుంది. ఆ టీ పెద్దావిడకు నచ్చడంతో ఇలా రా ఒకసారి అని పిలిచి డబ్బులు ఇవ్వబోతుంది. అయ్యయ్యో వద్దమ్మా ఈరోజు డబ్బులు తీసుకోను అంటుంది. డబ్బులు ఇవ్వడం లేదు కానీ.. సుఖీభవ.. అంటుంది పెద్దావిడ. మమకారపు మాధుర్యం.. అంటూ ఆ యాడ్ ముగుస్తుంది. ఆ తర్వాత శరత్ చేసిన డ్యాన్స్.. వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిటీ పోలీసులు వంతు వచ్చింది. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని వారు సజెస్ట్ చేస్తున్నారు. ఒకవిధంగా ఇదీ మంచిదే.












Click it and Unblock the Notifications