బండి పాదయాత్ర.. శనివారమే టూర్.. లభించని పోలీసుల అనుమతి
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర శనివారం నుంచి ప్రారంభం అవనుంది. ఉదయం చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఆయన పాదయాత్ర ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ హాజరు కానున్నారు.
బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర నాలుగు విడతల్లో కొనసాగనుంది. మొదటి విడత పాదయాత్ర అక్టోబరు 2న హుజూరాబాద్ లో ముగించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పాదయాత్ర రోజుకు పది కిలోమీటర్లు కొనసాగనుంది. కాగా, రేపు ప్రారంభం కానున్న ప్రజా సంగ్రామ యాత్ర తొలి రెండ్రోజులు హైదరాబాద్ పరిధిలోనే జరగనుంది.

ఇలా ఉంటే డి సంజయ్ పాదయాత్రకు ఇంకా పోలీసుల అనుమతి లభించలేదు. సంజయ్ పాదయాత్రకు అనుమతి కోరుతూ గత వారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి బీజేపీ బృందం లేఖ అందజేసింది. ఇప్పటివరకు పాదయాత్రకు పోలీసుల అనుమతి రాలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రేపటి పాదయాత్ర కోసం కమలం పార్టీ భారీ ఏర్పాట్లు చేసుకుంది. శనివారం నుంచి బండి సంజయ్ 'ప్రజా సంగ్రామ యాత్ర'ను ప్రారంభిస్తారు.
వాస్తవానికి బండి సంజయ్ ఆగస్ట్ 9న పాదయాత్ర ప్రారంభించాలని అనుకున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర నేపథ్యంలో దీనిని వాయిదా వేశారు. ఈ నెల 24 నుంచి పాదయాత్ర చేపట్టాలని ఫిక్స్ అయ్యారు. దీంతో బీజేపీ శ్రేణులు పాదయాత్ర కోసం ఏర్పాటు చేస్తున్నాయి. కానీ కల్యాణ్ సింగ్ మరణంతో మరోసారి వాయిదా పడింది.
యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మృతితో ఆగస్టు 24 వరకు సంతాప దినాలుగా బీజేపీ ప్రకటించింది. మరోవైపు 24 నుంచే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండేది. సంతాప దినాల నేపథ్యంలో పాదయాత్రను వాయిదా వేస్తున్నట్టుగా బండి సంజయ్ ప్రకటించారు. వివిధ కారణాలతో బండి సంజయ్ పాదయాత్ర రెండు సార్లు వాయిదా పడింది. ఇదీ బీజేపీ క్యాడర్‌ను నిరుత్సాహ పరిచింది.
Recommended Video
ఇటు బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. 'ప్రజా జీవన యాత్ర' పేరుతో హుజూరాబాద్ నియోజకవర్గంలో గల కమలాపూర్ మండలం బత్తినవారిపల్లి నుంచి ప్రారంభం అయ్యింది. నియోజకవర్గంలో వివిధ గ్రామాల మీదుగా 23 రోజుల పాటు ఈటల పాదయాత్ర చేయాల్సి ఉంది. మొత్తం 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో.. 270 కిలోమీటర్లు ఈటల రాజేందర్ పాదయాత్ర చేయాలి.. కానీ అస్వస్థత కారణంగా పాదయాత్రకు మధ్యలోనే బ్రేక్ పడింది. మరోవైపు మోకాలికి ఆపరేషన్ జరిగింది. దీంతో వైద్యులు పాదయాత్ర చేయొద్దని సూచించారు. దీంతో ఆయన పాదయాత్రకు శాశ్వతంగా బ్రేక్ పడినట్టే అవుతుంది.












Click it and Unblock the Notifications