హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసుల కళ్లుగప్పి జేబీఎస్ చేరుకున్న బండి సంజయ్.. ఇబ్బందులపై ఆరా..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఆర్టీసీ ఛార్జీల మోత మోగింది. ఇప్పటికే పెట్రో ధరలు.. మంచినూనె ధర, పప్పుల ధరలు పెరిగి చుక్కలు చూపిస్తున్నాయి. దీనికితోడు ఆర్టీసీ ఛార్జీలు కూడా అలానే పెరుగుతున్నాయి. ఛార్జీలే కాదు.. విద్యార్థుల బస్సు పాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇంకేముంది సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇవాళ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు నిరసనకు పిలుపు ఇవ్వడం.. హౌస్ అరెస్ట్ చేయడం జరిగిపోయింది. అయినప్పటికీ బండి సంజయ్ జేబీఎస్ చేరుకున్నారు.

ఉదయమే ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు..

ఉదయమే ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు..

బండి సంజయ్ ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయాన్నే ఆయన ఇంటికి వెళ్లారు. పదుల సంఖ్యలో వెళ్లి.. ఇంటి ముందు గుమిగూడారు. దీనికి సంబంధించి వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి. అయితే ఆయన వారి కళ్లు గప్పి మరీ జూబ్లి బస్టాండ్ చేరుకున్నారు. అక్కడ ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రయాణికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

మరీ సౌకర్యాలు ఏవీ..?

మరీ సౌకర్యాలు ఏవీ..?


టీఆర్ఎస్ సర్కారు ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రయాణికులపై పెనుభారం మోపుతోందని బండి సంజయ్ మండిపడ్డారు. చార్జీలు పెంచిన మేర సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న బస్సులు కండిషన్‌లో లేవని గుర్తుచేశారు. బస్సుల నిర్వహణ కూడా సరిగ్గా ఉండదని పేర్కొన్నారు. బస్టాండ్లలో కనీస వసతులు లేవని, శుభ్రత కరవైందని ఫైరయ్యారు. ఎవరి బాగు కోసం చార్జీలు పెంచుతున్నారని ప్రశ్నించారు.

Recommended Video

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
ఛార్జీల మోత

ఛార్జీల మోత


ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత కీలక సంస్కరణలు చేస్తున్నారు. మరుమూల ప్రాంతాలకు బస్సు సర్వీస్ లేకుంటే మరునాడే అందజేశారు. కార్మికుల శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. అక్రిడెటేషన్ జర్నలిస్టులకు ఇదివరకు ఆన్ లైన్‌లో 2/3 రాయితీ ఉండేది కాదు.. దానిని కూడా చేశారు. ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు తానే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కానీ ఛార్జీల మోత మాత్రం తప్పడం లేదు. ఎప్పుడూ నష్టాలు అంటూనే.. ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు. ఇందులో సామాన్యుడి గోడును మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై విపక్షాలు గళం ఎత్తుతున్నాయి.

English summary
bjp telangana president bandi sanjay reached the jbs. talked to the passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X