"మెగా " కాంపౌండ్ లో భోగి వేడుకలు : చిరంజీవి సందడి - దోశలు వేస్తూ..!!
పండుగ వచ్చిందంటే "మెగా" కాంపౌండ్ లో సందడే సందడి. అందరూ ఒకే చోట చేరి పండుగ చేసుకోవటం.. ప్రత్యేక సందర్భాలను కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు తెలుగు ప్రజలకు ముఖ్యమైన సంక్రాంతి సంబరాలు అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ రోజు భోగి కావటంతో మెగాస్టార్ ఇంట పండుగ సందడి నెలకొంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఇక, మెగాస్టార్ నివాసంలో జరిగిన భోగి వేడకల్లో చిరంజీవి సందడి చేసారు. మెగా వారుసులు సైతం వేడుకల్లో పాల్గొన్నారు.
మెగా ఫ్యామిలీ మొత్తం భోగా సంబరాల్లో
ఉదయం భోగి మంటలు వేసి.. ఆ తరువాత అందరికీ చిరంజీవి దోశలు వేస్తూ ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చిరంజీవితో పాటుగా వరుణ్ తేజ్ సైతం దోశలు వేస్తూ కనిపించారు. అయితే, దోశలు వేసే క్రమంలో చిరంజీవి వేస్తున్నది సరిగా రాలేదు. మరో వైపు వరుణ్ తేజ్ దోశ బాగానే వచ్చింది. దీంతో.. చిరంజీవి అల్లరి మొదలు పెట్టారు. వరుణ్ తేజ్ వేసిన దోశను చిందరవందన చేసేసారు.
నాకు కుళ్లు వచ్చేసింది..చెడగొట్టేయాలి..అంటూ ఉప్మా చేశాను అంటూ చిరు అల్లరితో కుటుంబ సభ్యులంతా ఎంజాయ్ చేసారు. ఈ మొత్తాన్ని వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్టు చేసారు. దానికి బాస్ చిరంజీవితో దోస మేకింగ్ 101.. 2022 భోగి" .. అందరికి భోగీ శుభాకాంక్షలు అంటూ పోస్టు చేసారు.
బాస్ దోశ మేకింగ్..అంటూ చిరు సందడి
పండుగ నాడు మెగా ఫ్యాన్స్ కు ఈ వీడియోతో జోష్ పంచారు. ఈ వీడియోలో చిరు తల్లి అంజనా దేవి, నాగబాబు దంపతులు, మెగా ప్రిన్సెస్ నిహారిక, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తరువాత చిరంజీవి భోగి సందర్భంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో 79750మెగాస్టార్ క్లాప్‌తో రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం 'రావణాసుర' పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

'హీరోస్ డోన్ట్ ఎగ్జిస్ట్' అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ పవర్ఫుల్ లాయర్‌గా కనిపించనున్నారు.












Click it and Unblock the Notifications