• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

BIgg Boss Telugu: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కంటెస్టెంట్: హౌస్‌లో గ్రాండ్ ఫినాలే హీట్

|

హైదరాబాద్: రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 ముగింపు దశకు వచ్చేస్తోంది. 77 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్... గ్రాండ్ ఫినాలే వేడి రాజుకుంటోంది. గ్రాండ్ ఫినాలే గడువు సమీపిస్తోన్న కొద్దీ బిగ్‌బాస్ హౌస్ హీటెక్కుతోంది. కంటెస్టెంట్ల మధ్య పోటీ తత్వం పెరుగుతోంది. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కులూ హౌస్‌మేట్స్ మధ్య మరింత కన్‌ఫ్లిక్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. వచ్చేనెల 20వ తేదీన గ్రాండ్ ఫినాలే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

హౌస్‌ నుంచి మరొకరు అవుట్..

హౌస్‌ నుంచి మరొకరు అవుట్..

ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు మిగిలారు. మరి కొన్ని గంటల్లో ఆ కంటెస్టెంట్లలో మరొకరు నిష్క్రమించబోతున్నారు. ఆ ఎవరనేది తెలియాలంటే రాత్రి దాకా వేచి చూడాల్సిందే. ఈ సారి లాస్య ఎలిమినేట్ అవుతుందనే లీకులు వినిపిస్తున్నాయి. 11వ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారిలో అభిజిత్, అరియానా, మోనాల్ గజ్జర్, దేత్తడి హారిక, లాస్య ఉన్నారు. ఎలిమినేషన్‌ను ఎదుర్కొన్న వారిలో సొహైల్ ఉన్నప్పటికీ.. శనివారమే అతను సేవ్ అయ్యాడు. ఓటింగ్ పరంగా చూస్తూ చివరి మూడు స్థానాల్లో మోనాల్, లాస్య, అరియానాలు ఉన్నారు. లాస్య ఎలిమినేట్ కావడానికే అవకాశాలు ఉన్నాయంటూ తెలుస్తోంది.

ఆ ముగ్గురి మధ్యా టఫ్ ఫైట్..

బిగ్‌బాస్ టాప్-5లో ఎవరు చేరుకుంటారనే అంశంపై శనివారం నాటి ఎపిసోడ్‌లో ఓ క్లారిటీ ఇచ్చారు కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు. అభిజిత్, అఖిల్, సొహైల్..కంటెస్టెంట్ల కుటుంబ సభ్యుల మనస్సులను గెలుచుకున్నారు. ఎనిమిది మంది కంటెస్టెంట్ల కుటుంబ సభ్యుల టాప్-5 జాబితాలో అభిజిత్, అఖిల్, సొహైల్ ఉన్నారు. ఈ ముగ్గురి మధ్యే టఫ్ ఫైట్ కూడా నిలిచే అవకాశాలు లేకపోలేదు. ఆ తరువాత అరియానా, మోనాల్ గజ్జర్ లేదా దేత్తడి హారిక టాప్-5 చేరొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అవినాష్‌కూ తొలి అయిదుమందిలో చేరొచ్చని చెబుతున్నప్పటికీ.. అతనికి కొన్ని కాంట్రాక్టులు ఉన్నందు వల్ల బయటికెళ్తారని అంచనాలు ఉన్నాయి.

ట్రెండింగ్‌లో అభిజిత్..

శనివారం సాయంత్రం నుంచీ అభిజిత్ పేరు ట్రెండింగ్‌లో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. #WeAdmireAbijeet పేరుతో అతని అభిమానులు హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి, ట్విట్టర్‌లో వదిలారు. సోషల్ మీడియాను షేక్ చేస్తోందా హ్యాష్‌ట్యాగ్. 200కెలకు పైగా ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. #WeAdmireAbijeet, #Abijeet.. ఈ రెండు హ్యాష్‌ట్యాగ్లు ఓ రేంజ్‌లో పోస్ట్ అయ్యాయి. బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 విజేత అతనేనంటూ అభిజిత్ ఫ్యాన్స్.. ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకుముందు ఈ స్థాయిలో అభిజిత్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ కాలేదు. గ్రాండ్ ఫినాలే సమీపిస్తుండటంతో అతని ఫ్యాన్స్ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చేశారు.

  'Still The Boss'- Chris Gayle, The Only Cricketer To Score 1000 Sixes In T20 History | #UniverseBoss
  మోనాల్ తల్లి సైతం..

  మోనాల్ తల్లి సైతం..

  మోనాల్ గజ్జర్ తల్లి గీతాబెన్ గజ్జర్ కూడా అభిజిత్ వైపే మొగ్గు చూపడం.. అతనికి ఉన్న ఫాలోయింగ్‌ను స్పష్టం చేస్తోందని చెబుతున్నారు ఫ్యాన్స్. మోనాల్ తరువాత తనకు ఇష్టమైన కంటెస్టెంట్ అభిజితే అంటూ గీతాబెన్ వెల్లడించిన విషయం తెలిసిందే. సొహైల్ సోదరుడు కూడా అఖిల్‌ను ప్రశంసించాడు. అఖిల్ మైండ్‌గేమ్ అద్భుతంగా ఆడుతున్నాడంటూ కితాబిచ్చాడు. వాటన్నింటినీ ఆధారంగా చేసుకుని చూస్తే.. ఈ సారి అభిజిత్ టైటిట్ విన్నర్‌గా నిలవడం ఖాయమని అభిమానులు జోస్యం చెబుతున్నారు.

  English summary
  BIgg Boss Telugu season 4 contestent Abijeet name trending in social media by his fans and admirs. Fans of Abijeet using #WeAdmireAbijeet hashtag on twitter.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X