హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రయల్స్‌కు సిద్ధమైన బయోలాజికల్ ఈ లిమిటెడ్ కరోనా వ్యాక్సిన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరం నుంచి మరో వ్యాక్సిన్ వచ్చేందుకు సన్నాహాలు సిద్ధమవుతోంది. కరోనా వ్యాక్సిన్ పరిశోధనలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైంది. టీకా మొదటి, రెండోదశ ప్రయోగాల కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి పొందినట్లు సంస్థ వెల్లడించింది.

అమెరికాకు చెందిన డైనావాక్స్ టెక్నాలజీస్ కార్పొరేషన్, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు బయోలాజికల్ ఈ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాటల్ తెలిపారు.

Biological E. Limited’s COVID-19 vaccine enters Phase I,II trial

కరోనావైరస్‌ను ఎదుర్కోవడంలో మరో ప్రభావవంతమైన వ్యాక్సిన్ అందిసామని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రయోగాల్లో భాగంగా, 16 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు గల 360 మంది వాలంటీర్లపై టీకాను ప్రయోగించనున్నారు. వీరికి 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల వ్యాక్సిన్ ఇస్తారు.

Recommended Video

COVID-19 Vaccine : కరోనా మహమ్మారిని ఒక టీకా ఏమీ చేయలేదు! - WHO Chief

అనంతరం వ్యాక్సిన్ భద్రత, రోగనిరోధకత స్థాయిలను విశ్లేషిస్తారు. ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి రానున్నాయి. కాగా, హైదరాబాద్ నగరానికి చెందిన మరో ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ నుంచి కోవాగ్జిన్ వ్యాక్సిన్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ మూడో దశకు చేరుకుంది.

English summary
Biological E. Limited (BE), a Hyderabad-based vaccines and pharmaceutical company, has initiated a Phase I/II clinical trial of its COVID-19 subunit vaccine candidate in India following approval from the Drugs Controller General of India (DGCI).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X