రూ.250 కోట్ల నష్టం: తెలంగాణ పౌల్ట్రీపై తీవ్ర ప్రభావం, అటు కరోనా.. ఇటు
తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమకు బర్డ్ ప్లూ నష్టాలను తీసుకొచ్చింది. బర్డ్ ఫ్లూ వస్తుందనే భయంతో చాలా మంది చికెన్ తినాలనే ఆసక్తి చూపించడం లేదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువే పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించి ఉంది. అయితే కరోనా తర్వాత బర్డ్ ప్లూ కూడా భయపెట్టింది. కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించిన తొలినాళ్లో చికెన్ తెగ లాగించేశారు. కానీ బర్డ్ ప్లూ వస్తోందని.. కోళ్లను పట్టుకునే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నారు. కానీ చికెన్ ప్రియులు మాత్రం బర్డ్ ప్లూ వల్ల చికెన్ కొనుగోలు చేయడం లేదు.

రూ.250 కోట్ల నష్టం..
దీంతో రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు నష్టాలు వాటిల్లినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉంది. దాని వల్ల ఆయా రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు భారీ నష్టాలు వాటిల్లాయి. దేశవ్యాప్తంగా రూ.3,400 కోట్ల మేర పౌల్ట్రీ పరిశ్రమకు నష్టం వాటిల్లినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్ర వాటా ఎక్కువగానే ఉంది.

7 లక్షల కోళ్ల కొనుగోళ్లు
తెలంగాణ రాష్ట్రంలో రోజూ సగటున 2 కిలోల బరువుండే ఏడు లక్షల కోళ్ల కొనుగోళ్లు జరుగుతున్నాయని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ మేనేజర్ సంజీవ్ చింత్వార్ చెప్పారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కువగా లేనప్పటికీ.. ఆ భయం చాలా మందిని చికెన్ వైపు చూడనివ్వలేదని పేర్కొన్నారు. దీంతో అమ్మకాలు పడిపోయాయని ఆయన చెప్పారు. కోడిగుడ్ల అమ్మకాలు కూడా తగ్గాయని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో అమ్మకాలు పడిపోయినా చికెన్ ధరలు మాత్రం
తగ్గడం లేదు. పౌల్ట్రీ రైతులకు నష్టాలు వచ్చినా.. చికెన్ అమ్మే రిటైల్ వ్యాపారులు మాత్రం భారీగా లాభపడ్డారని ఓ రైతు చెప్పారు. రాష్ట్రంలో ఒక్క బర్డ్ ప్లూ కేసు కూడా లేకపోవడంతో మళ్లీ ఇప్పుడిప్పుడే మార్కెట్ పుంజుకుంటోందని పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. పూర్వ స్థితికి రావడానికి మాత్రం కొంచెం సమయం పడుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications