హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతుకు, ఉప్పుడు బియ్యానికి సంబంధం ఏంటీ: బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఏదో సాకు పెట్టి ఆరోపించడం మంచి పద్దతి కాదన్నారు. ప్రతీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ముడిపెట్టడం తగదని చెప్పారు. సీఎం కేసీఆర్ డొల్లతనం బయటపడిందని బండి సంజయ్ అన్నారు. ధాన్యం గురించి ప్రశ్నిస్తే పారబాయిల్డ్ రైస్ లేఖను టీఆర్ఎస్ రిలీజ్ చేసిందన్నారు. ధాన్యం కొనమని.. టీఆర్ఎస్ రిలీజ్ చేసిన లేఖలో ఎక్కడా లేదని ఆయన పేర్కొన్నారు. కానీ కావాలనే ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు.

ధాన్యం గురించి తాను మాట్లాడితే ఉప్పుడు బియ్యం గురించిన లేఖను రిలీజ్ చేశారని చెప్పారు. రైస్ ఎంత ఇచ్చినా కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కొందరు పారాబాయిల్డ్ రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయి కేసీఆర్ ఉప్పుడు బియ్యం కొనాల్సిందే అని కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. రైతుకు, ఉప్పుడు బియ్యానికి సంబంధం లేదు అని మరోసారి గుర్తు చేశారని చెప్పారు.

bjp bandi sanjay angry on cm kcr

పలు అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై నెపం నెడుతుంది. దానిని బీజేపీ నేతలు వెంటనే ఖండిస్తున్నారు. ప్రతీ అంశాన్ని తమపై రుద్దడం భావ్యం కాదని ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాలు కాపీ కొడుతున్నారని కామెంట్స్ చేస్తారు.. నిధులు ఇస్తోన్న ఇవ్వడం లేదని చెబుతారని బండి సంజయ్ ఫైరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం చేసే ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. ఊరికేనే ఆరోపణలు చేస్తే నిజం అయిపోవు అని స్పష్టంచేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచార పర్వం నిన్న ముగిసింది. ఈ నెల 30వ తేదీ శనివారం పోలింగ్ జరగనుంది. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు చేపట్టి.. విజేతను ప్రకటించారు. బై పోల్ ప్రచారం టీఆర్ఎస్- బీజేపీ మధ్య హోరా హోరీగా జరిగింది. విజయవాకాశాలు మాత్రం బీజేపీకే ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ కూడా జోరుగా ప్రచారం చేసింది. సంక్షేమ పథకాల పేరు చెప్పి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఎటువైపు తీర్పు చెబుతారో చూడాలీ మరీ.

English summary
cm kcr false allegations to central government bjp state president bandi sanjay alleges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X