Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

10వ తేదీన తెలంగాణ బంద్, బీజేపీ పిలుపు

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించిన.. ఆ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. జీవో 317ను పున:సమీక్షించాలని బీజేపీ కోరుతుంది. దీనిని నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన (సోమవారం) రాష్ట్ర బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. బంద్ విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేసింది. జీవో 317 వల్ల టీచర్లు సొంత ప్రాంతంలో ఉద్యోగం చేసుకునే అవకాశం కోల్పోతున్నారని ఆరోపించింది.

జాగరణ దీక్ష

జాగరణ దీక్ష

జీవో 317 కోసం ఆదివారం బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో ప్రవేశ పెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిని సవాల్ చేస్తూ బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించింది. రిమాండ్‌ను హైకోర్టు రద్దు చేసింది. బుధవారం బండి సంజయ్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలను వినిపించారు. ఈ మేరకు బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలి ఇచ్చిందని బీజేపీ లీగల్ సెల్ మీడియాకు తెలియజేసింది.

 10 కేసులు

10 కేసులు

అంతకుముందు బండి సంజయ్‌ కుమార్‌పై పోలీసులు 10 కేసులు నమోదు చేశారు. ఆదివారం కోవిడ్ నిబంధనలకు సంబంధించి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దానితో సహా మరో పది కేసులను చూపించారు. డిజాస్టర్ మేనెజ్‌మెంట్ యాక్ట్ సహా 3 సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి. బండి సంజయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో కేసుల వివరాలు ఉన్నాయి.

వారి సేవలు మరిచారా..?

వారి సేవలు మరిచారా..?

అంతకుముందు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని బండి సంజయ్‌ అన్నారు. చారిత్రకమైన సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం వంటి కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. తాజాగా కొత్త జోనల్ వ్యవస్థలో భాగంగా రీ అలాట్ మెంట్ పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందన్నారు. బదిలీల ప్రక్రియ పేరుతో ఈ జీవోను అమలు చేస్తే లక్షలాది ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు చనిపోతున్నా సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి రావడం లేదని విమర్శించారు. వెంటనే 317జీవోను ఉపసంహరించుకోవాలని లేకపోతే..ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బండి సంజయ్‌ హెచ్చరించారు

Recommended Video

    Analysis On JP Nadda Hyderabad Visit | BJP Vs TRS | Oneindia Telugu
    నిరుద్యోగ దీక్ష కూడా

    నిరుద్యోగ దీక్ష కూడా

    ఇంతకుముందు ఉద్యోగ ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్‌ చేస్తూ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. నిరుద్యోగ దీక్షను ముందుగా ఇందిరాపార్కులో చేపట్టాలని అనుకున్నా కరోనా నిబంధనల కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష చేపట్టారు. దీక్షను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్ చుగ్ ప్రారంభించగా.. పదాధికారులు, విజయశాంతి, ఈటల రాజేందర్‌, స్వామిగౌడ్‌, ఇతర నేతలు పాల్గొన్నారు. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో సాధించిన విజయాలతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ 2023లో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఆ క్రమంలోనే బండి సంజయ్ ప్రజల్లోకి వెళుతున్నారు. నిరుద్యోగ దీక్ష.. జాగరణ దీక్ష చేపట్టగా దుమారం రేగింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+