హైకోర్టులో బీజేపీ రిట్ పిటిషన్, మొయినాబాద్ ఇష్యూని సీబీఐకి అప్పగించాలని పిల్
మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇష్యూపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి విచారణ చేపట్టాలని రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. అలాగే తమకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో గల పోలీసులపై నమ్మకం లేదని తెలిపింది. కేసు విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు అప్పగించాలని కోరింది.
సీబీఐ లేదంటే సిట్టింగ్ జడ్జీ చేత విచారణ జరిపించాలని కోరింది. పిటిషన్‌లో 8 మంది ప్రతివాదులను చేర్చింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్, సీపీ సహా ఎనిమిది మందికి నోటీసులు పంపాలని కోరింది. పిటిషన్ విచారణ స్వీకరించే అంశం.. విచారణ గురించి హైకోర్టు రిజిష్టార్ తెలియజేయాల్సి ఉంది.

నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ సీబీఐ విచారణ కోరుతుంది. ఆ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌లో ఉన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
మునుగోడు బై పోల్ వేళ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తీవ్ర దుమారం రేపింది. ఇదీ కేసీఆర్ స్కెచ్ అని బీజేపీ అంటుండగా.. బీజేపీ బండారం బయటపడిందని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు.












Click it and Unblock the Notifications