హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిగ్గుచేటు, అప్పుడట్లా ఇప్పుడిట్లానా?: కేసీఆర్ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడ్డ విజయశాంతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సీనియర్ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని, భూములను లాక్కున్నారని.... వాటిని తిరిగి ఇప్పిస్తానని పోడు భూములను సాగుచేసుకుంటున్న గిరిజన అడవి బిడ్డలకు హామీనిచ్చి, ఎన్నికల్లో గెలిచాక... తానే వచ్చి డివిజన్ల వారీగా మీటింగులు పెట్టి, పోడు రైతులకు పట్టాలిప్పిస్తానని సీఎం కేసీఆర్ స్వయంగా మూడుసార్లు అసెంబ్లీలో హామీ ఇచ్చారన్నారు.

కేసీఆర్ సర్కారు తీరుతో దయనీయ స్థితిలో పోడు రైతులు

కేసీఆర్ సర్కారు తీరుతో దయనీయ స్థితిలో పోడు రైతులు

పోడు ప్రాంతాల్లో కుర్చీ వేసుకొని అక్కడికక్కడే సమస్యను పరిష్కరిస్తానన్నారు కేసీఆర్.. కానీ, అవే భూముల్లో అంగుళం కూడా వదలకుండా హరితహారంలో మొక్కలు నాటాలని ప్రభుత్వం ఫారెస్టోళ్లకు తెరవెనుక ఆదేశాలిస్తున్నది. దీంతో ఏటా వానాకాలంలో పంటలు వేసేందుకు గిరిజనులు, మొక్కలు నాటేందుకు ఫారెస్టోళ్లు భూముల్లోకి వస్తుండడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంటున్నది. తమ భూముల జోలికి రావద్దని ఫారెస్టోళ్లను పోడు రైతులు కాళ్లావేళ్లా పడి వేడుకుంటున్నా వినడం లేదు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గిరిజన రైతులపై హత్యాయత్నం కింద నాన్ ​బెయిలబుల్ ​కేసులు పెట్టి పోలీస్​ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. రాష్ట్రంలో వందలాది పోడు రైతులు అటు భూములు పోయి, ఇటు కేసులపాలై దయనీయంగా బతుకుతున్నారు అని విజయశాంతి తెలిపారు.

కేసీఆర్ సర్కారుకు సిగ్గుచేటు

కేసీఆర్ సర్కారుకు సిగ్గుచేటు


పొట్టకూటి కోసం తరతరాలుగా తాము సాగుచేసుకుంటున్న పోడు భూములకు హక్కులు కల్పించాలని అడుగుతున్న అడవి బిడ్డలకు రాష్ట్ర సర్కారు పట్టాలియ్యకపోగా..ఉల్టా కేసులు పెట్టి సతాయించడం సిగ్గుచేటు. గర్భిణులు, చంటి పిల్లల తల్లులు, వృద్ధులు అని కూడా చూడకుండా కటకటాల పాలు చేయడం చూస్తుంటే.. పోడు రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఇదే పోడు భూముల సమస్యపై సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలం గుర్రంబోడు గిరిజనులు పోరాటానికి దిగితే... వారిపై కక్ష పూరితంగా కేసులు నమోదు చేసి.. వారికి మద్దతుగా పోరాడిన బీజేపీ నాయకులపై కేసులు బనాయించి జైలుకు తరలించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోడు భూముల సమస్యపై సీఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. కేవలం హుజురాబాద్ ఎన్నికలపైనే దృష్టి పెట్టి, కులాల వారిగా ఓట్లను ఎలా రాబట్టాలనే ఆలోచనతో ఉన్నారు. కావున యావత్ తెలంగాణ పోడు రైతులు కంకణబద్ధులై, టీఆర్ఎస్ పాలనకు తగిన బుద్ది చెప్పాలి అని విజయశాంతి పిలుపునిచ్చారు.

రైతులను ఏడిపిస్తున్న కేసీఆర్..

రైతులను ఏడిపిస్తున్న కేసీఆర్..

మరోవైపు, 2018 ఎన్నికల నేపథ్యంలో రైతులకు లక్షరూపాయల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి... అధికారంలోకి వచ్చిన తర్వాత, కేవలం కొంతమంది రైతులకు 25 వేలు మాత్రమే రుణమాఫీ చేశారు. దీంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వకపోవడమే కాకుండా... ఉన్న రుణానికి వడ్డీ కట్టించుకుంటూ రెన్యూవల్ చేస్తున్నాయి. పంట రుణమాఫీ కోసం రైతన్నలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలను అడ్డం పెట్టుకొని ఇదిగో రుణమాఫీ, అదిగో రుణమాఫీ అంటూ ఓట్లు దండుకొని, గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచి.. ఇప్పుడు మళ్ళీ హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనైనా రుణవిముక్తి కలుగుతుందని సంబరపడ్డ రైతుల కళ్ల వెంబడి కన్నీళ్లు కారేలా చేస్తోందని కేసీఆర్ సర్కారుపై బీజేపీ నాయకురాలు రాములమ్మ మండిపడ్డారు. .

రైతు రుణమాఫీ మున్నాళ్ల ముచ్చటేనా?.. ఇప్పుడు దళితబంధు నాటకం

రైతు రుణమాఫీ మున్నాళ్ల ముచ్చటేనా?.. ఇప్పుడు దళితబంధు నాటకం


సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆగస్ట్ 1న తేదీన జరిగిన కేబినెట్ మీటింగ్‌లో రైతు రుణమాఫీకి రూ.2006 కోట్లు అవసరమని ప్రతిపాదన చేసి, స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా.. 50 వేల లోపు ఉన్న రుణాలకు రుణ విముక్తి కల్పిస్తామని ప్రకటన చేశారు. ఆగస్టు 16 నుంచి 31లోపున వేస్తామని ఆశ పెట్టి, కేవలం ఆగస్ట్ 26 వరకు కొంతమంది రైతులకు మాత్రమే బ్యాంకు ఖాతాలో డబ్బు వేసి, ఆగస్ట్ 26 తర్వాత 4.97 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.1682 కోట్లకు గాను.. ఒక్క రూపాయి కూడా వేయకపోవడంతో తెలంగాణ రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా మారింది. గత సంవత్సరం, ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి, మినుము, వరి పంటలు దెబ్బతినగా... ఇప్పుడు రుణమాఫీ జరగక, రాయితీ విత్తనాలు ఇవ్వక, రైతులు అప్పుల బాధతో ఉరి తాడుకు బలవుతున్నారు. బ్యాంకు నుండి తీసుకున్న పంట రుణాల రుణమాఫీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుతున్న 'దళిత బందు పథకం' అనే నాటకం కోసం... రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ నిధులు తరలిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా అప్పుల ఊబిలో ఉన్న రైతుల పట్ల అశ్రద్ధ వహిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా యావత్ తెలంగాణ రైతులు ఆలోచించాలి. టీఆర్ఎస్ సర్కార్ ఆడుతున్న కపట నాటకాన్ని గమనించి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ది చెప్పాలన్నారు మాజీ ఎంపీ విజయశాంతి.

English summary
BJP leader Vijayashanti hits out at kcr government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X