Priyanka Reddy Murder: తెలంగాణపై మాయని మచ్చ, సీఎం కేసీఆర్ స్వయంగా..
డాక్టర్ ప్రియాంకారెడ్డి రేప్, హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తున్నది. ఈ హేయమైన చర్యపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. సామాజిక మాధ్యమాల్లో ప్రియాంకారెడ్డి హత్యను సాధారణ పౌరుల నుంచి ప్రముఖుల వరకు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు, జాతీయ మహిళా కాంగ్రెస్ స్పందించింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు మురళీధర్ రావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు స్పందించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
అతి దారుణంగా లైంగికదాడి, హత్యకు గురైన ప్రియాంకారెడ్డి ఘటనపై కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి స్పందించారు. ప్రియాంకారెడ్డి హత్య తనను తీవ్రంగా కలిచివేసింది. శంషాబాద్ వద్ద ఆమెను కాల్చి చంపిన ఘటన పిరికిపందల చర్య. ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. నేను స్వయంగా తెలంగాణ డీజీపీతో మాట్లాడుతాను. ఈ కేసులో దర్యాప్తును త్వరగా పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరుతాను అని కిషన్ రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మురళీధర్ రావు ట్వీట్
హైదరాబాద్‌లో జరిగిన ప్రియాంకారెడ్డి దారుణహత్యతో తీవ్ర వేదనకు లోనయ్యాను. తెలంగాణపై మాయని మచ్చ. ఈ హత్యకేసు దర్యాప్తును తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించాలి. త్వరలోనే నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి అని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డారు.

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్వీట్
ప్రియాంకారెడ్డి దారుణ హత్యతో షాక్ గురయ్యాను. వెటర్నరీ డాక్టర్ హత్యా వార్త విన్నవెంటనే తీవ్రమైన విషాదంలో మునిగిపోయాను. ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్‌ను నియమించాలని, వెంటనే దర్యాప్తు పూర్తి చేయాలని తెలంగాణ డీజీపీని కోరుతాను. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తాను అని బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు.
Recommended Video

జాతీయ మహిళా కాంగ్రెస్ ట్వీట్
హైదరాబాద్‌లో రేప్, హత్యకు గురైన యువ డాక్టర్ ప్రియాంకారెడ్డి ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాను. ఈ దేశంలో మహిళల పరిస్థితి ఎలా ఉందనే విషయం ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది అని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ట్విట్టర్‌లో స్పందించారు. ఓ అమ్మాయి వాహనం చెడిపోతే వారి దుస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని గమనించాలని మంత్రి సృతిఇరానీ, తెలంగాణ సీఎంవోకు సూచించారు.
-
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!!












Click it and Unblock the Notifications