బ్యానర్ల రగడ.. నియమాలు బీజేపీకేనా.. టీఆర్ఎస్‌కు పట్టవా: రాజా సింగ్
హైదరాబాద్ గులాబీమయంగా మారింది. ప్లీనరీ నేపథ్యంలో ప్లెక్సీలు, కటౌట్‌లు వెలిశాయి. అయితే దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అందులో ముందుండే బీజేపీ అపొజ్ చేస్తోంది. ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే రాజా సింగ్ ఒంటికాలిపై లేచారు. టీఆర్ఎస్ పార్టీకో విధానం.. తమకో విధానమా అని అడిగారు. ఇదేం పద్ధతి అంటూ విరుచుకుపడ్డారు.
హైదరాబాద్‌లో రాజకీయ పార్టీల బ్యానర్ల ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రహదారిపై అడ్డంగా భారీ కట్ అవుట్లు, పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేయడంపై నగర వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సంధర్భంగా మంగళవారం హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున బ్యానర్లు, కట్ అవుట్లు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీ బ్యానర్ల ఏర్పాటు పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

నగరంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు బ్యానర్లు పెడితే వెంటనే తొలగిస్తామని కేటీఆర్ అన్నారని గుర్తుచేశారు. జీవోను కూడా విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ జీఓకు విరుద్ధంగా టీఆర్ఎస్ పార్టీ నేతలు భారీ కట్ అవుట్లు పెట్టారని..బహుశా ఈ జీవో బీజేపీకి ఇతర పార్టీలకు మాత్రమే వర్తిస్తుంది కావచ్చు అని కామెంట్ చేశారు. నగరంలో టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లు పెట్టినప్పుడల్లా జిహెచ్ఎంసి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్..సెలవు పై వెళ్తున్నారని..గతంలో కూడా ఇదే మాదిరిగా టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరంలో బ్యానర్లు కటౌట్లు పెట్టినప్పుడు విశ్వజిత్ సెలవుపై వెళ్లారని తెలిపారు.
బీజేపీ ప్రశ్నిస్తుందనే ఆయన అలా వెళ్ళిపోతున్నారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. గతంలో భాగ్యనగరం పరిధిలో బీజేపీ కార్యకర్తలు బ్యానర్లు పెడితే తొలగించారని అంటే టిఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఒక న్యాయమా? అని రాజాసింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం రాత్రిలోగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన బ్యానర్లను జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలగించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. లేదంటే ముందు ముందు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే బ్యానర్లను కూడా జీహెచ్ఎంసీ అధికారులు తొలగించకూడదని రాజాసింగ్ అన్నారు.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications