దోచుకోవడం.. దాచుకోవడమేనా, షర్మిల రాజన్న రాజ్యం కామెంట్లపై బీజేపీ ఫైర్
వైఎస్ షర్మిలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాజన్న రాజ్యం అంటే దోచుకోవడం.. దాచుకోవడమేనని బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది రాజన్న రాజ్యమేనని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాజన్న రాజ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరిగారని గుర్తుచేశారు.
షర్మిల ప్రసంగం సీఎం కేసీఆర్ రాసి ఇచ్చిందేనని తీవ్రమైన విమర్శలు చేశారు. లక్ష మందితో టీఆర్‌ఎస్ సభ నిర్వహిస్తామంటుంటే అనుమతి ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్‌లో విచ్చలవిడిగా మద్యం పంచుతున్నారని ప్రభాకర్ ఆరోపించారు. నిన్న ఖమ్మం సంకల్ప సభలో షర్మిల బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ మాటలు చెప్పడం తప్ప చేతల్లో ఏదీ చూపడం లేదని ఎద్దేవాచేశారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, తాను టీఆర్‌ఎస్ చెబితేనో, బీజేపీ అడిగితేనే, కాంగ్రెస్ పంపిస్తేనో రాలేదని స్పష్టం చేశారు. రాజన్న బిడ్డేనని, ఎవరి కింద పనిచేయనని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోనన్నారు. తమ పార్టీలో నేటి కార్యకర్తలే రేపటి నాయకులని షర్మిల చెప్పారు. షర్మిల ప్రసంగం మొత్తం కేసీఆర్‌పై విమర్శలు.. బీజేపీపై ఎత్తిపొడుపుతో కొనసాగింది. కాగా ఇవాళ బీజేపీ స్పందించింది.
Recommended Video
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేస్తానని షర్మిల ప్రకటించారు. ఇక్కడ ప్రజల పక్షం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే తాను పార్టీ పెట్టబోతున్నానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండా అని తెలిపారు.












Click it and Unblock the Notifications