హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోనాల ఎఫెక్ట్: మందుబాబులకు షాక్-హైదరాబాద్‌లో 2 రోజులు వైన్ షాపులు బంద్-ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్ దర్వాజ బోనాల పండగ నేపథ్యంలో ఆది,సోమవారాల్లో హైదరాబాద్,సైబరాబాద్ పరిధిలోని వైన్ షాపులు,బార్లు,కల్లు దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు బేఖాతరు చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. వరుసగా రెండు రోజులు వైన్ షాపులు మూసివేయనుండటంతో మందు బాబులు అలర్ట్ అయ్యారు. ముందుగానే మద్యం స్టాక్ తెచ్చి పెట్టుకుంటున్నారు. బోనాల పండగ సందర్భంగా ప్రతీ ఏటా వైన్ షాపులు మూసివేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, పండగ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.

ఏయే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు...

ఏయే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు...

ప్రస్తుతం తెలంగాణలో బోనాల సీజన్ సాగుతోంది. ఈ నేపథ్యంలో పాతబస్తీ లాల్ దర్వాజలో ఆదివారం బోనాల పండగ జరగనుండగా.. సోమవారం ఘటాల ఊరేగింపు జరగనుంది. నగరంలో బోనాలు జరిగే చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఫలక్‌‌నుమా, ఇంజన్ బౌలి నుంచి వచ్చే వాహనాలు అలియాబాద్ నుంచి షంషీర్ గంజ్, గోశాల మీదుగా వెళ్ళాలి.

కందికల్ గేట్ బాలరాజ్ గంజ్ మంచి లాల్ దర్వాజ మార్గంలో ట్రాఫిక్‌ను అనుమతించరు. ఓల్డ్ ఛత్రినాక మీదుగా గౌలిపురా వైపు మళ్లిస్తారు.
ఉప్పుగూడ నుంచి ఛత్రినాక వైపు నుంచి వచ్చే వెహికల్స్ ను గౌలిపురా క్రాస్ రోడ్స్ నుంచి మొగలురా పీఎస్ వైపు మళ్లిస్తారు.
మీరా కా దయార మొఘలురా నుంచి హరిబౌలి క్రాసక్కు వచ్చే ట్రాఫిక్ను వాటర్ ట్యాంక్ ఏరియా మీదుగా డైవర్ట్ చేస్తారు.
చార్మినార్ మెయిన్ రోడ్, అస్రా హాస్పిటల్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మొఘల్‌పురా వాటర్ ట్యాంక్ మీదుగా బీబీ బజార్ వైపు మళ్లిస్తారు
లాల్ దర్వాజ టెంపుల్, ఊరేగింపు జరిగే 19 ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి
చార్మినార్ ఫలక్ సుమా, నయాపూల్ నుంచి ఓల్డ్ సీబీఎస్, అఫ్టల్ గంజ్, దారుసలాం క్రాస్ రోడ్స్ మీదుగా ఆర్టీసీ బస్సులను అనుమతించదు.

ఎటువైపు మళ్లిస్తారు...

ఎటువైపు మళ్లిస్తారు...

యాకుత్‌పురా నుంచి గుల్జార్‌ హౌస్‌కు వెళ్లే వాహనాలను మీరాలం మండి రోడ్డులోకి ఇతేబార్‌ చౌక్‌ నుంచి మిరాలం మండి, అల్జాకోట్ల వైపు వైపు మళ్లిస్తారు.

పురానా హవేలి, మండి రోడ్‌ నుంచి చెత్త బజార్‌కు వచ్చే ట్రాఫిక్‌ను లక్కడ్‌ కోఠి చౌరస్తా వద్ద దారుల్‌ షిఫా వైపు మళ్లిస్తున్నారు.
చాదర్‌ఘాట్‌, నూర్‌ఖాన్‌ బజార్‌, దారుల్‌ షిఫా నుంచి నయాపూల్‌ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు, ఈ వాహనాలను ఎస్‌జే రోటరీ నుంచి పురానా హవేలి, శివాజీ బ్రిడ్జి, చాదర్‌ఘాట్‌ వైపు మళ్లిస్తారు.
ఫతే దర్వాజ నుంచి వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా ఎక్స్‌ రోడ్డువైపు అనుమతించరు, హోల్గా హోటల్‌ వద్ద ఖిల్వత్‌ వైపు మళ్లిస్తారు.
బండి కీ అడ్డా, ఝాన్సీబజార్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను గుల్జార్‌ హౌస్‌ వైపు అనుమతించరు, మిట్టీ కె షేర్‌ వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తారు.
పురానాపూల్‌, గుడ్‌ విల్‌ హోటల్‌, మూసాబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలను నయాపూల్‌ వైపు అనుమతించరు, ముస్లీంజంగ్‌ బ్రిడ్జి వద్ద మళ్లిస్తారు.
గౌలిగూడ, సిద్దిఅంబర్‌ నుంచి నయాపూల్‌ వైపు వచ్చే వాహనాలను అఫ్జల్‌గంజ్‌ చౌరస్తా నుంచి ముస్లీంజంగ్‌ బ్రిడ్జ్‌ ఉస్మానియా దవాఖాన రోడ్డు వైపు మళ్లిస్తారు.
మదీన ఎక్స్‌ రోడ్స్‌, ఇంజన్‌బౌలి, జహనుమా రోడ్లు మూసివేస్తారు. ఎలాంటి వాహనాలను అనుమతించరు.

ఉప్పల్ నుంచి బెళ్లే బస్సులు ఆ రూట్‌లో

ఉప్పల్ నుంచి బెళ్లే బస్సులు ఆ రూట్‌లో

అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయం వద్ద భారీ ఎత్తున బోనాలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఆది,సోమవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సోమవారం మధ్యాహ్నం 3 నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఉప్పల్ నుంచి అంబర్ పేట్ మీదుగా వెళ్లే సిటీ బస్సులను హబ్సిగూడ, తార్నాక, అడిక్‌మెట్,విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, నింబోలి అడ్డా చాదర్ ఘాట్ మీదుగా సీబీఎస్ వైపు మళ్లిస్తారు. ఉప్పల్-అంబర్ మార్గంలో వెళ్లే సిటీ బస్సులను గాంధీ విగ్రహం వద్ద సీపీవెల్ సల్లావా గేట్, టి- జంక్షన్, రోడ్ నం.6, అలీ కేఫ్ మీదుగా మళ్లిస్తారు. నింబోలి అడ్లా మీదుగా దిల్‌సుఖ్‌నగర్, శివం రోడ్ నుంచి అంబర్ పేట వైపు వచ్చే బస్సులను అలీ కేఫ్,తిలక్‌నగర్ మీదుగా మళ్లిస్తారు.నింబోలి అడ్డా నుంచి అంబర్‌పేట్ వైపు వచ్చే బస్సులను టూరిస్ట్ హోటల్స్, ఫీవర్ హాస్పిటల్, ఓయూ ఫ్లైఓవర్, తార్నాక మీదుగా మళ్లిస్తారు.

Recommended Video

spl interview with congress senior leader VH on Dalitha bandhu
పార్కింగ్ ప్రదేశాలు...

పార్కింగ్ ప్రదేశాలు...

అలియాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను పోస్టాఫీస్‌కు ఎదురుగా, శాలిబండ వద్ద సింగిల్ లైన్, అల్కా థియేటర్ బహిరంగ ప్రదేశంలో పార్కు చేయాలి. హరిబౌలి నుంచి వచ్చే వాహనాలను ఆర్యా మైదాన్, సుధా థియేటర్ లేన్, అల్క థియేటర్ వద్ద ఉన్న ప్రదేశంలో పార్క్ చేయాలి. ఛత్రినాక పాత పోలీస్ స్టేషన్ వైపు నుంచి వచ్చే వాహనాలను వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం, లక్ష్మీనగర్, సరస్వతి విద్యానికేతన్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఫలక్‌నుమా, పత్తర్ కి దర్గా సమీపంలో పార్క్ చేయాలి.మూసాబౌలి, మీర్ చౌక్ వైపు నుంచి వచ్చే వాహనాలను చార్మినార్ బస్ టర్మినల్ వద్ద పార్క్ చేయాలి.

English summary
In the view of Bonalu festival, all the liquor shops,bars and toddy shops, will be closed for two days on Sunday and Monday.Traffic restrictions also imposed in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X