హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు తెలంగాణ కోసం యుద్ధం.. ఇప్పుడు దేశం కోసం: క్రిస్మస్ విందులో కేసీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అన్ని మతాలను సమానంగా చూడటంతో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదరులకు శుభకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, క్రైస్తవ మత పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జై భారత్ నినాదంతో ముందుకేనంటూ కేసీఆర్

జై భారత్ నినాదంతో ముందుకేనంటూ కేసీఆర్

ఈ సందర్భంగా జై భారత్ నినాదంతో మనమందరం పురోగమించి అద్భుతమైన భారతావని నిర్మాణం కోసం క్రిస్మస్ సందర్భంగా అంకితమవుదామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. క్రీస్తు బోధనలు తప్పకుండా ఆచరిస్తే ఈ ప్రపంచం ఈర్ష్య, అసూయ, ద్వేషం, స్వార్థం, ఇతరుల పట్ల అసహనం ఉండవని అన్నారు. ప్రపంచంలో యుద్ధాలే జరగవన్నారు. నేరస్తుల కోసం జైళ్లే అవసరముండదన్నారు. తనను తాను ప్రేమించినట్లే పొరుగువారిని ప్రేమించాలని క్రీస్తు చెప్పారన్నారు. క్రీస్తు బోధనలు అందరూ పాటించి సంతోషకర జీవితాన్ని గడపాలన్నారు.

అప్పుడు తెలంగాణ కోసం.. ఇప్పుడు దేశం కోసమన్న కేసీఆర్

అప్పుడు తెలంగాణ కోసం.. ఇప్పుడు దేశం కోసమన్న కేసీఆర్

జై తెలంగాణ స్వరాష్ట్రం కోసం యుద్ధం ప్రారంభించి.. చివరికి విజయం సాధించామన్నారు కేసీఆర్. తమ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం లక్ష రూపాయల నుంచి రూ. 2.75 లక్షలకు చేరిందన్నారు. తెలంగాణ సాధించిన పురోగతి దేశంలోని అన్ని రాష్ట్రాలలో, అన్ని ప్రాంతాల్లో కూడా రావాలన్నారు. అందుకోసం మరో కొత్త యుద్ధానికి శంఖం పూరించామన్నారు కేసీఆర్. తెలంగాణ మాదిరిగానే భారతదేశం అన్ని రకాలుగా పురోగమించి.. ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా పురోగమించే దిశగా మనకు విజయం చేకూరాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. అందుకు మీ అందరి సహకారం కావాలన్నారు.

జాతీయ స్థాయిలో క్రైస్తవ పెద్దలతో భేటీ అవుతానన్న కేసీఆర్

జాతీయ స్థాయిలో క్రైస్తవ పెద్దలతో భేటీ అవుతానన్న కేసీఆర్


జై తెలంగాణ నినాదంతో తెలంగాణ సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగామో.. జై భారత్ నినాదంతో మనమందరం పురోగమించి అద్భుతమైన భారతావని నిర్మాణం కోసం క్రిస్మస్ సందర్భంలో అంకితమవుదామని కేసీఆర్ పిలుపునిచ్చారు. త్వరలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రైస్తవస్త పెద్దలద్ద తో సమావేశమవుతానని కేసీఆర్ పేర్కొన్నారు.
కాగా, ఈ క్రిస్మస్ విందు కార్యక్రమంలో సుమారు 10వేల మంది క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు.

English summary
BRS for Country: CM KCR participated in christmas dinner event held in LB Stadium, hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X