BRS: బీఆర్ఎస్‍కు రాజీనామా చేసి కాంగ్రెస్‍లో చేరిన బండి రమేష్..

తెలంగాణలో ఎన్నికలు నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీల్లోకి వలసలు కొనసాగుతోన్నాయి. ఆ పార్టీ ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ వలసలు కొనసాగుతోన్నాయి. టికెట్ రాని వారు పార్టీలు మారుతున్నారు. తాజాగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి ముఖ్యం నేత పార్టీ వీడారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్‌ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

బండి రమేష్ రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి రాహుల్ గాంధీ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. బండి రమేష్ శేరిలింగంపల్లి అసెంబ్లీ టికెట్‌ దక్కకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బండి రమేష్ కు కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టికెట్ హామీ రావడంతో ఆయన పార్టీ మారినట్లు తెలుస్తోంది. ఇదే శేరిలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కీలక నేత కూడా మూడు రోజుల క్రితమే పార్టీ మారారు.

BRS State Secretary Bandi Ramesh joined Congress

మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హఫీజ్ పేట కార్పొరేటర్ పూజిత గౌడ్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నుంచి కాంగ్రెస్ తరుఫున పోటీ చేసే అవకాశం ఉంది. జగదీశ్వర్ గౌడ్ కొంతకాలంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్​ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే బీఆర్ఎస్ అధిష్ఠానం మళ్లీ సిట్టింగ్​ఎమ్మెల్యేకే బీఆర్ఎస్ టికెట్​ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటించిన నాటి నుంచి జగదీశ్వర్ గౌడ్ టికెట్ కోసం బీఆర్ఎస్ పెద్దలను కలిసే ప్రయత్నం చేశారు. తాజాగా బీఆర్ఎస్ అరెకపూడి గాంధీకి బీఫామ్ అందించింది. దీంతో జగదీశ్వర్ గౌడ్ పార్టీని వీడారు. అప్పట్లోనే జగదీశ్వర్ గౌడ్ పార్టీ వీడుతున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో బీఆర్ఎస్ అధిష్ఠానం ఆయనకు జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ అవకాశం కల్పించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+