అశోక.. ఎంత పనిచేశావురా..? సాయి శ్రియ పరువు తీశావుగా, బుల్లెట్ బండి పాటతో
బుల్లెట్ బండి ఎక్కి వచ్చేతపా.. అనే సాంగ్ మోహన భోగరాజు పాడిన.. సాంగ్ వైరల్ అయ్యింది మాత్రం సాయి శ్రియ వల్లే. ఈమె ఇంజినీరింగ్ చేసిన.. టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్‌ను పెళ్లాడింది. బరాత్ సమయంలో సాయి శ్రియ చేసిన డ్యాన్స్ అప్పట్లో వైరల్ అయ్యింది. దాంతో ఆ కపుల్ కూడా ఫేమస్ అయ్యారు.
హైదరాబాద్‌లోనే కాపురం పెట్టారు. వేములవాడ వచ్చిన సమయంలో కూడా వారిని ఫోటోలు తీసేందుకు మీడియా ప్రతినిధులు చుట్టుమట్టారు. అయితే ఆ అబ్బాయి.. అదే అశోక్ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాడెండ్‌గా దొరికిపోయాడు. దీంతో వచ్చిన ఆ పేరు కాస్తా పోయి.. చెడ్డ పేరు వచ్చింది.

అశోక్.. బడంగ్ పేట్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్నాడు. వారి పెళ్లయినప్పటీ నుంచి గుట్టుగా ఉంటున్నారు. కానీ లంచం తీసుకోవడంతో ఒక్కసారిగా మరోసారి వెలుగులోకి వచ్చాడు. ఓ ఇంటికి సంబంధించిన పర్మిషన్ కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. అతడి నివాసంలో కూడా ఏసీబీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు.
వారి పెళ్లి ఊరేగింపులో బుల్లెట్ బండి సాంగ్‌కు సాయి శ్రియ డ్యాన్స్ చేసింది. సాయి శ్రియ భర్తే అశోక్.. కానీ ఇంతలోనే అతని పేరు మసకబారిపోయింది. లంచం తీసుకోవడంతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ సారి మాత్రం బ్యాడ్ నేమ్ వచ్చింది.












Click it and Unblock the Notifications