Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్వర్ణ విగ్రహానికి భద్రత.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, జెడ్ క్యాటగిరీ ప్రొటెక్షన్.. రూ.75 కోట్ల..

ఇటీవల భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 120 కిలోల భగవత్ రామానుజాచార్యుల సమతామూర్తి స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. 216 అడుగుల రామానుజాచార్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. స్వర్ణ విగ్రహాం విలువ దాదాపు 75 కోట్ల వరకు ఉంటుంది. ముచ్చింతల్ సమతామూర్తి దర్శనానికి జనాలకు అనుమతించారు. దీంతో స్వర్ణమూర్తి విగ్రహా భద్రత ప్రశ్న తలెత్తింది. స్వర్ణమూర్తికి బుల్లెట్‌ ప్రూఫ్‌ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు జెడ్ కేటగిరి స్థాయిలో భద్రతా చర్యలు చేపడుతున్నారు.

Recommended Video

    Statue Of Equality: Story Behind Sri Ramanujacharya Statue | PM Modi | Oneindia Telugu
    12 రోజులపాటు ఉత్సవాలు..

    12 రోజులపాటు ఉత్సవాలు..


    12 రోజుల పాటు ముచ్చింతల్‌లో జరిగిన రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తర్వాత కూడా ఇదే స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపడుతున్నారు. విగ్రహానికి 6 నుంచి 8 అడుగుల దూరం నుంచి బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌ ఫ్రేమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏర్పాటు చేసేవరకు స్వర్ణమూర్తి సందర్శనకు ఎవరిని అనుమతించరు. ఈ ప్రాంతంలో 24 గంటల పాటు ఆయుధాలు ధరించిన వారు పహారా కాస్తుంటారు.

    అలంకరణకే 6 కిలోల బంగారం

    అలంకరణకే 6 కిలోల బంగారం


    120 కిలోల స్వర్ణమూర్తి కావడం.. అలంకారణకు ఐదారు కిలోల బంగారు ఆభరణాలను కూడా వినియోగించారు. ప్రస్తుతం స్వర్ణమూర్తి విలువ 75 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ నిత్య కైంకర్యాలు నిర్వహించే పూజారులు మినహా మరెవరిని విగ్రహం దగ్గరకు అనుమతించారు. ఇక సమతాస్ఫూర్తి ప్రాంగణంలో 250 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఫీడ్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

    50 ఎకరాలు

    50 ఎకరాలు

    50 ఎకరాల్లో విస్తరించిన ఈ క్షేత్రాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు రెండు షిఫ్టుల్లో 300 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. లోపలకు ఎంతమంది వచ్చారు, తిరిగి బయటకు ఎందరు వెళ్లారన్న వివరాలు తెలిసే ఏర్పాటు చేస్తున్నారు. స్ఫూర్తి కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లు, ఇతర బ్యాగేజీని అనుమతించకూడదని భావిస్తున్నారు. టికెట్‌ కౌంటర్‌ పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో సెల్‌ఫోన్లు, లగేజీ, పాదరక్షలు అప్పగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫుడ్‌ కోర్టు దగ్గర ఎగ్జిట్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఎంట్రీ వద్ద అప్పగించిన వస్తువులు కన్వేయర్‌ బెల్టు ద్వారా ఎగ్జిట్‌ వరకు చేరతాయి. అక్కడ వాటిని తీసుకుని బయటకు రావాల్సి ఉంటుంది.

    స్కానర్లు

    స్కానర్లు

    సమతాస్ఫూర్తి కేంద్రంలోకి వచ్చే ప్రతి వెహికల్‌ను స్కానర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అనుమానిత వాహనాలను ఆపేందుకు బూమ్‌ బారియర్స్, బొల్లార్డ్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక వేళ వాటిని చేధించుకొని వెళ్లే వాహనాల టైర్లను చీల్చే టైర్‌ కిల్లర్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమతాస్ఫూర్తి కేంద్రంలో గల ఆలయాల్లో నిత్య కైంకర్యాలను నిర్వహించేందుకు 250 మంది అర్చకులను నియమిస్తారు. 108 దివ్యదేశాల్లో ఇద్దరు చొప్పున, మిగతా ఆలయాల్లో మరికొందరని నియమిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇతర అవసరాలకు కలిపి మొత్తం 800 మంది సిబ్బంది ఉంటారని తెలుస్తోంది.

    ఇక నిత్యం అనుమతి

    ఇక నిత్యం అనుమతి

    సమతాస్ఫూర్తి కేంద్రానికి భక్తులను ఎల్లవేళలా అనుమతించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. పనులు పూర్తయ్యేవరకు దర్శనాలను కేవలం సాయంత్రం వేళకే పరిమితం చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి ఆరున్నర వరకు అనుమతిస్తారు. మరో నెల రోజుల్లో పనులు పూర్తవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. సాంకేతిక కారణాల వల్ల 3డీ లేజర్‌షో తాత్కాలికంగా నిలిపివేశారు. మందిరాన్ని దర్శించడానికి పెద్దలకు 150 రూపాయలు.. చిన్నారులకు 75 రూపాయలు ఎంట్రీ ఫీజుగా చెల్లించాలని నిర్ణయించారు. మొదట పెద్దలకు 500, చిన్నారులకు 200 రూపాయల టికెట్ ధర పెట్టాలని భావించారు. భక్తులకు భారమవుతుందని దానిని 150కి తగ్గించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+