విద్యార్థులకు కేసీఆర్ అన్నం కూడా పెట్టలేడా.?మధ్యహ్న భోజనపథకాన్ని ఎందుకు నిలిపేసారన్న బండి సంజయ్.!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి విరుచుకు పడ్డారు. నిరుపేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తూ వారి ఆకలిని తీరుస్తున్న మద్యాహ్న భోజన పథకాన్ని నిలిపేసి పేద విద్యార్థుల నోట్లో మట్టికొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై ధ్వజమెత్తారు. మద్యాహ్న భోజన పథకంలో భాగస్వామ్యులైన కార్మికులకు విడుదల చేయాల్సిన నిధులను కూడా విడుదల చేయక పోవడం వల్ల ఆ కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఆర్దికంగా అనేక సమస్యల్లో చిక్కుకుంటున్నారని, వెంటనే వారి బకాయిలు విడుదల చేసి మద్యాహ్న భోజన పథకాన్ని పునఃప్రారంభించాలని డిమాండ్ చేసారు బండి సంజయ్.
Recommended Video

మద్యహ్న భోజన పథకాన్ని ప్రారంభించండి.. తెలంగాణ ప్రభుత్వానికి బీజేపి సూచన
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోవడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ముఖ్యమంత్రి నుండి కనీస స్పందన లేకపోవడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్. మద్యాహ్న భోజన సౌకర్యం లేక పోవడంతో నిరుపేద పిల్లలు చదువుకునే అవకాశాలు సన్నగిల్లాయని తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఎంతో ఉపయుక్తంగా ఉన్న పథకాన్ని ఎందుకు నిలిపేసారని తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు బండి సంజయ్.

పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగం.. వెంటనే అమలు చేయాలన్న బండి సంజయ్
చంద్రశేఖర్ రావు నిరంకుశ, నిర్లక్ష్య వైఖరివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసారు. తమ పిల్లలు తినే బియ్యాన్నే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తింటున్నారని పదేపదే గొప్పగా ప్రచారం చేసుకుంటున్న చంద్రశేఖర్ రావు పిల్లలు పస్తులుండటాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేసారు.

60శాంతం నిధులు కేంద్రమే సమకూరుస్తోంది.. ఎందుకు నిలిపేసారన్న బీజేపి
కార్మిక చట్టాలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకంతో పాటు కార్మికులకు గౌరవ వేతనాన్ని వెంటనే పెంచాలని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు అతి తక్కువ గౌరవ వేతనాన్ని చెల్లిస్తోందని చంద్రశేఖర్ రావు ప్రభుత్వమేనని బండి సంజయ్ స్పష్టం చేసారు. మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే ఆహార ధాన్యాలను, వాటి రవాణాకయ్యే ఖర్చునూ 100 శాతం కేంద్రమే చెల్లిస్తోందని వివరించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు చెల్లిస్తున్న గౌరవ వేతనంలోనూ 60 శాతం కేంద్రమే చెల్లిస్తోందని బండి సంజయ్ తెలిపారు.

పేద విద్యార్ధులకు అన్నం పెట్టండి.. వారి నోట్లో మట్టి కొట్టొద్దన్న బండి సంజయ్
దీనిని ద్రుష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచుతూ, అందుకయ్యే వ్యయాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నాయని గుర్తు చేసారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికుల కనీస గౌరవ వేతనాన్ని పెంచాలని విద్యాశాఖ ప్రతిపాదనలు పంపినా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు సంజయ్. గత 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసారు.












Click it and Unblock the Notifications