అంబర్ పేటలో సీసీఎస్ ఎస్సై ఆత్మహత్య ... కారణం అదేనా ?

తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్ అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీఎస్ ఎస్సై సైదులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య, పిల్లలను స్కూళ్లో దింపేందుకు వెళ్లిన సమయంలో సైదులు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు .గత కొంత కాలంగా సైదులు అనారోగ్యంతో బాధ పడుతున్నాడని, అధికారులు ఏ మాత్రం జాలి లేకుండా తన భర్తను వేధించారని అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని భార్య నీలిమ ఆరోపిస్తున్నారు. మూడు నెలల క్రితం అంబర్‌పేట్ ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన సైదులు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది .

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సైదులు మెడికల్ బిల్లులకు దరఖాస్తు చేసుకోగా, పై అధికారులు వాటిని తిరస్కరించారని తెలిపారు. గతంలో మొబైల్ కోర్టులో పనిచేసిన సమయంలో కూడా సైదులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్టు సమాచారం. ఇక తాజాగా సైదులు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అధికారుల వేధింపులే సూసైడ్‌కి కారణమని భార్య నీలిమ ఆరోపిస్తున్నారు.

 CCS SI Suicide in Amberpet ...The reason is

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే సైదులు ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడనేది ఇంకా తెలియలేదు. అధికారుల వేధింపులు కారణమా లేదా కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా ? ఆయన మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా పోలీస్ శాఖలో తీవ్ర పని ఒత్తిడి ఉంటున్న నేపధ్యంలో పోలీసు శాఖలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని భావిస్తున్నారు అధికారులు. పని ఒత్తిడి తెగ్గించేందుకు కూడా శాఖాపరంగా కసరత్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+