సమతామూర్తి భావితరాలకు స్ఫూర్తి: రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించిన అమిత్ షా..
ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల విగ్రహాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సందర్శించారు. శనివారం ప్రధాని మోడీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తర్వాత జనం కూడా భారీగా తరలివస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ సీఎం జగన్ కూడా సందర్శించారు. ఇవాళ ప్రాంగణానికి అమిత్ షా చేరుకున్నారు. ఇటు శ్రీరామానుచార్యుల విగ్రహాన్ని తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. సినీ ప్రముఖులు వీవీ వినాయక్, రాజేంద్రప్రసాద్, దిల్ రాజు సమతామూర్తిని దర్శించుకున్నారు.

అమిత్ షా రాక..
ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహాన్ని అమిత్ షా సందర్శించారు. ఆశ్రమానికి విచ్చేసిన అమిత్ షాకు చిన్నజీయర్ స్వామి స్వాగతం పలికారు. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది మహోత్సవాలకు అమిత్ షా పంచెకట్టు, తిరునామంతో వచ్చారు. ఆశ్రమంలోని విశేషాలను ఆయనకు చిన్నజీయర్ స్వామి వివరించారు. శ్రీ రామానుజాచార్యుల వారి దివ్య సందేశం స్ఫూర్తిదాయకం అని అమిత్ షా పేర్కొన్నారు. మనుషులంతా ఒక్కటేనని రామానుజాచార్యులు చాటిచెప్పారని, సమతామూర్తి భావి తరాల వారికి స్ఫూర్తి మంత్రం అని వెల్లడించారు. ఇక్కడికి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అమిత్ షా తెలిపారు. సనాతన ధర్మం అన్నింటికి మూలం అని వివరించారు. సమతా మూర్తి విగ్రహ ఏకతా సందేశాన్ని అందిస్తోందని వివరించారు.
పులకించిన ముచ్చింతల్
వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో ముచ్చింతల్ పులకించింది. శ్రీమన్నారాయణ మంత్రంతో ముచ్చింతల్ మార్మోగుతుంది. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఏడోరోజు శ్రీరామనగరంలో రథ సప్తమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, సామూహిక పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో దుష్టగ్రహ బాధానివారణకై శ్రీనారసింహ ఇష్టి, జ్ఞాన జ్ఞానాకృత సర్వవిధ పాపనివారణకు శ్రీమన్నారాయణ ఇష్టి వైభవంగా జరిగాయి. శ్రీలక్ష్మీ నారాయణ మహాక్రతువులో భాగంగా పెరుమాళ్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చతుర్వేద పారాయణం జరిగింది.
ఆదిత్య హృదయ సామూహిక పారాయణం చేశారు. అనంతరం శ్రీనారాసింహ అష్టోత్తర శతనామావళి పూజను అహోబిలం రామానుజజీయర్ స్వామీజీ నిర్వహించారు .

జనంలోకి సిద్దాంతాలు
శ్రీరామానుజుల సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చిన్నజీయర్ స్వామి సంకల్పించారు. శ్రీరామనగరంలోని ప్రవచన మండపంలో ధర్మాచార్య సదస్సును నిర్వహించారు. దేశంలో అన్నిప్రాంతాల నుంచి విచ్చేసిన 200 మందికి పైగా ధర్మాచార్యులు, స్వాములు, సాధుసంతుల సలహాలను కోరారు. ధర్మాచార్య సదస్సులో నాలుగు ప్రధాన అంశాలను చర్చించారు. రామానుజాచార్యుల శ్రీమూర్తి లోకార్పణం చేశామని చిన్నజీయర్ స్వామి వివరించారు. సమతా సాధనకు కృషి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. దేశంలో కుల, మత, జాతి, వర్గాలను సమాజం నుంచి తొలగించాలంటే ఎలాంటి మార్గదర్శనం చేయాలో సూచనలివ్వాలని కోరారు. ప్రతీరంగంలో హెచ్చుతగ్గుల భావన నుంచి ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు మంచి మార్గాన్ని అన్వేషించాలని సూచించారు. మానసిక ఉజ్జీవన, సమాజ ప్రగతికి ఎలాంటి సూచనలు చేయాలో ధర్మాచార్యులు తెలియజేయాలని కోరారు. సనాతన ధర్మంలో స్వీయ ఆచారాలు చేసుకుంటూ పక్కవారి ఆచారాలను కూడా గౌరవిస్తూ సమాజ ప్రగతికి, అసమానతలను రూపు మాపేందుకు కృషిచేయాలన్నారు. ప్రాచీన వ్యవసాయక జీవన విధానాన్ని మెరుగుపర్చుకొని.. ప్రస్తుత జీవన విధానంలోకి ఉపయోగకరంగా మార్చుకోవాలన్నారు.

80 మంది స్వామిలు
ధార్మిక సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 80 మంది స్వామిజీలు, పీఠాధిపతులు పాల్గొన్నారు. అష్టాక్షరీ జియర్ స్వామి, పరిపూర్ణానందగిరి, శివస్వామి, స్కందదేవానంద, మాతా నిర్మలానందమయి, మాతా శివచైతన్య, రాధామనోహర్ స్వామి హాజరయ్యారు. ఏపీ సాధుపరిషత్ నుంచి అనేక మంది స్వాములు పాల్గొన్నారు. ఇక ఉత్తరాది నుంచి 80 మంది స్వామిజీ, సాధువులు, పీఠాధిపతులు హాజరయ్యారు. వీరిలో10 మంది మహామండలేశ్వరులు ఉండటం విశేషం, బీహార్ నుంచి మహంత్ రామ్‌దేశ్‌జీ విచ్చేశారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన కాశ్మీర్ సర్వజ్ఞ పీఠాధిపతి హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి సర్ సంఘ్‌చాలక్ బాగయ్య పాల్గొన్నారు. వీహెచ్‌పీ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ మిలింద్ పరాంజీ, సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మజీ, ఉపాధ్యక్షులు దినేష్ చందర్ జీ , సంయుక్త ప్రధాన కార్యదర్శి రాఘవులు హాజరయ్యారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications