16న సిటీకి అమిత్ షా రాక.. రెండు రోజులు మకాం
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని చెప్పడం.. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. 16వ తేదీన హైదరాబాద్ వస్తున్నారు.రెండు రోజుల పాటు నగరంలో ఉంటారు.
17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ వేడుకలకు కేంద్ర ప్రభుత్వం తరఫున అమిత్ షా హాజరు కానున్నారు. 16వ తేదీన హైదరాబాద్ వస్తారు. రాత్రి నగరంలో బస చేస్తారు. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు బీజేపీ నగర శాఖకు చెందిన పలువురు ప్రతినిధులతో భేటీ అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించారు. నగర శాఖ ప్రతినిధులతో కీలక సలహాలు, సూచనలు చేస్తారు.

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర బలగాలతో పరేడ్ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారు. కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలు ఏక్ నాథ్ షిండే, బసవరాజ్ బొమ్మై కూడా పాల్గొంటారని సమాచారం. మహారాష్ట్ర, కర్ణాటకతో తెలంగాణ విమోచనానికి సంబంధం ఉంది. నిజాం రాజ్యంలో కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన పలు జిల్లాలు ఉండటంతో వారిని కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేశారు. నిజాం నుంచి తెలంగాణ విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications