అమిత్ షా షెడ్యూల్ ఖరారు: రేపు రాత్రి రాక, బస ఇక్కడే
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రేపు (శుక్రవారం) రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఎల్లుండి జరిగే వేడుకల్లో పాల్గొంటారు. ఈ సారి తెలంగాణ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవాన్ని జరుపుతున్న సంగతి తెలిసిందే.

అమిత్ షా రాక..
శుక్రవారం రాత్రి 9.50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. ఆయన పోలీస్ అకాడమీలో బస చేస్తారు. 17వ తేదీ ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 8.45 నుంచి 11.45 వరకు పరేడ్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేస్తారు. తర్వాత పరేడ్ గ్రౌండ్ నుంచి బేగంపేట టూరిజం ప్లాజాకు చేరుకుని పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పాల్గొంటారు.

మోడీ బర్త్ డే వేడుకలు
శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌కు చేరుకుంటారు. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వికలాంగులకు ఉపకరణాలను అందజేస్తారు. సాయంత్రం పోలీస్ అకాడమీకి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 7.30కు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

విమోచన దినోత్సవం
దేశానికి స్వాతంత్ర్య వచ్చి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా అమృతోత్సవాలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది. నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాల పేరుతో కేంద్రం విమోచన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

జాతీయ సమైక్యతా దినం
సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలను జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 16వ తేది నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications