• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సీతక్క తల్లి సమ్మక్కకు చంద్రబాబు పరామర్శ, ఎమ్మెల్యే భావోద్వేగం.. థాంక్స్ అన్నా అంటూ

|

ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లి సమ్మక్క హైదరాబాదులోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సమ్మక్కను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి ఎమ్మెల్యే సీతక్క, ఏఐజీ వైద్యులను ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సీతక్క భావోద్వేగాలకు గురయ్యారు.

సీతక్క భావోద్వేగం..


సీతక్క నిరాడంబరత, ప్రజాసేవ, క్రమశిక్షణ తదితర అంశాలను చంద్రబాబు అక్కడి వైద్యులకు వివరించారు. ఆమె అవలంబిస్తున్న సేవా తత్పరత పట్ల చంద్రబాబు అభినందించారు. తన గురించి చంద్రబాబు అంతటి నేత ప్రత్యేకంగా వివరించడంతో సీతక్క ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. దీని గురించి ఆమె ట్విట్టర్‌లో వెల్లడించారు. తన తల్లిని పరామర్శించడమే కాకుండా, తమకు ధైర్యం చెప్పారని సీతక్క తెలిపారు. చంద్రబాబును సీతక్క తన ఆత్మీయ సోదరుడు అని అభివర్ణించారు. థాంక్స్ అన్నా అంటూ సీతక్క ట్వీట్ చేశారు.

డీసీపీ దురుసుగా..

డీసీపీ దురుసుగా..

కరోనాతో బాధపడుతున్న సీతక్క తల్లికి బ్లడ్‌ ఇచ్చేందుకు వెళ్తున్న.. బంధువుల పట్ల డీసీపీ రక్షిత దురుసుగా ప్రవర్తించారని నిన్న సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. వెహికల్‌ పర్మిషన్ ఉన్నా పోలీసులు ఆరగంట సేపు నిలిపివేశారన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు. సీతక్క వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఏసీపీ సమర్థన

ఏసీపీ సమర్థన

ఎమ్మెల్యే సీతక్క బంధువులను డీసీపీ రక్షిత నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీతక్క ఒంటికాలిపై లేచారు. అయితే ఆ ఘటనలో డీసీపీ రక్షిత ప్రమేయం లేదని, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని ఏసీపీ రంగస్వామి ప్రకటన చేశారు. దీంతో సీతక్క స్పందించారు. ఏసీపీ ప్రకటన వందకు వంద శాతం తప్పని అన్నారు. అక్క డ జరిగిన వాస్తవాన్ని తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని, పోలీసులు మానవత్వంతో పనిచేయాలని సూచించారు. వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయకూడదని సీతక్క అన్నారు.

సేవా కార్యక్రమాలు

సేవా కార్యక్రమాలు

అంతకుముందు సీతక్క పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అడవి రంగాపూర్‌ గ్రామంలో బండ్లపహాడ్‌ గొత్తికోయగూడెం వాసులకు సీతక్క ఆప‌న్న‌హస్తం అందించారు. గ్రామానికి దూరంగా నివసిస్తున్న గొత్తికోయలు కోవిడ్ నేప‌థ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. గుత్తికోయల వద్దకు వెళ్లి సరుకులు అందజేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రాంతానికి స‌రైన మార్గం లేదు. న‌డుస్తూ అంత‌దూరం స‌రుకులు తీసుకెళ్ల‌డం క‌ష్టం. ఈ క్ర‌మంలో ఎడ్లబండిపైనే ఆమె ప్రయాణించారు. ఆ బండిపైనే సరుకులు వేసుకుని అదే బండిపై తానూ అక్క‌డికి చేరుకున్నారు. ఆమె వెంట అనుచరులు, గన్‌మ్యాన్లు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. బియ్యం, కూరగాయలు, ఇతరత్రా సరుకులు గొత్తికోయలకు అందజేసి సీతక్క వారికి అండగా నిలిచారు. కోవిడ్ ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో సీత‌క్క చేసిన స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌లు అభినందిస్తూనే ఉన్నారు.

English summary
tdp chief chandrababu naidu spoke to mla sithakka mother. who treat to aig hospital hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X