చిన జియర్ స్వామీజీ జన్మదిన వేడుకలకు చంద్రబాబు నాయుడు
టీడిపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. హైదరాబాద్‌లోని ముచ్చింతల్ గ్రామంలోని ఆశ్రమంలో స్వామీజీ పుట్టిన రోజులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు హజరయ్యారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. స్వామీజీ చేసిన మంగళశాసనాలను అందరూ తమ జీవితంలో ఉపయోగించుకోవాలని ఈ సంధర్భంగా చంద్రబాబు సూచించారు.


జీయర్ స్వామి జన్మదిన వేడుకల్లో భాగంగా ఐదోరోజు తిరునక్షత్ర వేడుకలు నిర్వహించారు. కాగా ఆయన జన్మదినం సంధర్భంగా ఆశ్రమంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications