congress party trs party tdp sangareddy telangana assembly telangana cm ap cm ap politics కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి సంగారెడ్డి తెలంగాణ అసెంబ్లీ
ఏపీలో మళ్లీ చంద్రబాబే సీయం..! తెలంగాణలో కాంగ్రెస్ బతకాలన్న జగ్గారెడ్డి..!!

హైదరాబాద్: సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో సంచలన వ్యాఖ్యలకు తెరతీసారు. ఆంద్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రస్థావించి తెలంగాణలో వేడిపుట్టించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ముందుచూపు ఉన్న నాయకుడు అని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి కొనియాడారు. అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు నమ్మారని, ఏపీలో వచ్చే ఎన్నికల్లో అదే జరుగుతుందన్నారు. చంద్రబాబు రెండోసారి ఏపీ సీఎం కావడం ఖాయమన్నారు జగ్గారెడ్డి.

చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ కి మంచిదని, రాష్ట్రం గాడిలో పడుతుందన్నారు. బాబు రాష్ట్ర నాయకుడు కాదు, జాతీయ స్థాయి నాయకుడని, హైదరాబాద్ లో ఐటీ విస్తరణ వెనక చంద్రబాబు ఘనత ఉందని, ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిందేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ.. తెలంగాణాలో కాంగ్రెస్ బతికితేనే ప్రజలకు శ్రేయస్కరంగా ఉంటుందన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందని, అప్పుడు హోదాను అడగని కేసీఆర్ ..ఇప్పుడు హాదా అడగడం ఏంటి ..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు మెదక్ నుండి రాహుల్ గాంధీ పోటీచేయాలని కోరుకుంటున్నానని. కేసీఆర్ పోటీచేసినా, రాహుల్ గాంధీ అత్యదిక మెజారిటీతో విజయం సాధిస్తారని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.