కోడి ధరకు రెక్కలు: శ్రావణ మాసంలో కూడా.. కారణాలివే..
కరోనా వైరస్ ఏమో గానీ.. చికెన్ ధరలు కొండెక్కుతున్నాయి. రోజుకు ఎంతో కొంత ధర పెరుగుతూనే ఉంది. అయితే శ్రావణ, కార్తీక మాసాల్లో నాన్ వెజ్ ధర కొంత తగ్గుతుంది. కానీ కరోనా వల్ల అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ సారి అయితే ధర పెరుగుతుంది. వాస్తవానికి శ్రావణమాసంలో డిమాండ్ తగ్గినా.. చికెన్ ధర మాత్రం తగ్గలేదు. రెండు నెలల వ్యవధిలో చికెన్ ధరలు రెండు నుంచి మూడు రేట్లు పెరిగాయి.

రూ.200 నుంచి రూ.250
గత నెలలో రూ.220 నుంచి రూ.250 మధ్య ఉన్న చికెన్ ధర ఆగస్టులో రూ.300 వరకు చేరింది. శ్రావణమాసంలో డిమాండ్ తగ్గినా.. ధర తగ్గకపోవడం మధ్యతరగతి వినియోగదారులకి భారంగా మారింది. కరోనా ఫస్ట్ వేవ్ లో చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి. కేజీ రూ.20కి కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత వైద్యులు చికెన్ శక్తివంతమైన ఆహారం అని.. చికెన్ ద్వారా కరోనా రాదని తేల్చి చెప్పడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి.

పెరిగిన దాణ రేటు
రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో దాణ రేట్లు అమాంతం పెరిగాయి. కోడికి వేసే దానాల్లో ప్రధానంగా సోయా, మొక్కజొన్న ఉంటుంది. కరోనాకి ముందు కేజీ సోయా రూ.35 కి లభించేది. ప్రస్తుతం కేజీ సోయా రూ.105గా ఉంది. ఇక రూ.12, 13 రూపాయలకు లభించే కేజీ మొక్కజొన్న దాణ ఇప్పుడు రూ .23 కి చేరింది. దీంతో ఉత్పత్తి భారం భారీగా పెరిగింది. దీంతో బ్యాచ్ వేయడమే మానేశారు. దీంతో కేజీ చికెన్ రూ.300 చేరింది.

కోళ్ల పెంపకం నిలిపివేత
చాలామంది కోళ్ల పెంపకం నిలిపివేశారు. శ్రావణమాసంలో ఉండే డిమాండ్‌కి తగినట్లు ఉత్పత్తి లేదు. కోళ్లను వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రవాణా చార్జీలు, లేబర్ చార్జీలు పెరిగిపోవడంతో కోడి ధర కొండెక్కి కూర్చుంది. కోళ్ల ధరలు పెరిగినా, గుడ్డు ధరలు మాత్రం అదుపులోనే ఉన్నాయి. కోడిగుడ్డు రూ.5కే లభిస్తుంది. వేసవిలో రూ.6 వరకు పలికాయి. కానీ తర్వాత మాత్రం ఐదు రూపాయలకు విక్రయిస్తున్నారు.

బాయిలర్ కోడి
వాస్తవానికి మధ్యతరగతి ప్రజలు తినే నాన్ వెజ్ కోడి మాత్రమే.. అదీ కూడా బాయిలర్ కోడి.. నాటు కోడి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో సామాన్యుడు చికెన్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కానీ దాని ధర కూడా రూ.300 వరకు చేరడంతో.. బోరుమని అంటున్నారు. వారినికి ఒకసారి తినే మేము.. ఏం చేయాలి అని అంటున్నారు.