జాగ్రత్త.. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరగొచ్చు.. మంత్రులను అలర్ట్ చేసిన సీఎం కేసీఆర్
మంత్రులకు సీఎం కేసీఆర్ కీలక సూనచనలు చేశారు. ఇవాళ మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం మనపై పడబోతోందని చెప్పారు. ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సూచించారు. వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరును కేసీఆర్ గుర్తు చేశారు.

నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలకు అవకాశం ఇచ్చే పనులు చేయరాదని హితబోధ చేశారు. బీజేపీ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడులకైనా అందరూ సిద్ధంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. సీబీఐ విచారణల విషయంలో రాష్ట్రాల అనుమతి తప్పనిసరి చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామని అన్నారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయ పోరాటం చేద్దామని కూడా కేసీఆర్ అన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రుల దండయాత్ర మొదలైందని, భవిష్యత్తులో మరింత మేర పెరుగుతుందని అన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర మంత్రులు అలసత్వంగా ఉండొద్దని కేసీఆర్ సూచించారు.
తెలంగాణ విలీన దినోత్సవ వజ్రోత్సవాలు మూడు రోజులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్17 నాటికి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో విలనమై 75 ఏళ్లు అవుతుంది. సెప్టెంబర్ 17 ను 'తెలంగాణ జాతీయ సమైక్యతా దినం' గా పాటించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. 'తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల' ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications